Share News

Viral Video: ఏనుగు ఖుషీ అయితే ఎలా ఉంటుందో తెలుసా.. అరటి గెలను చూసిన ఏనుగు.. చివరకు..

ABN , Publish Date - Oct 19 , 2024 | 01:52 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఏనుగుపై గడ్డి మోపును వేసుకుని రోడ్డుపై వెళ్తుంటాడు. దారిలో మెల్లగా నడుచుకుంటూ వస్తున్న ఏనుగను అంతా ఆసక్తిగా గమనిస్తుంటారు. ఇంతలో ఓ ఆశ్చర్యకర గన చోటు చేసుకుంది. అక్కడే ఉన్న ఓ యువకుడు...

Viral Video: ఏనుగు ఖుషీ అయితే ఎలా ఉంటుందో తెలుసా.. అరటి గెలను చూసిన ఏనుగు.. చివరకు..

ఏనుగులు చూసేందుకు ఎంత భారీగా కనిపిస్తుంటాయో.. అంతే శాంతంగా కనిపిస్తుంటాయి. కోపం వస్తే ఎంత బీభత్సం సృష్టిస్తుంటాయో.. కొన్నిసార్లు అంతే ఖుషీగా కనిపిస్తుంటాయి. ఇలా చాలా ఏనుగులు సందర్భానుసారం చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. ఇలాంటి ఆసక్తికర ఘటనలకు సంబందించిన వీడియలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దారిన పోతున్న ఏనుగుకు ఓ వ్యక్తి అరటి గెల అందించాడు. దాన్ని తినగానే ఏనుగు ప్రవర్తనను నెటిజన్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఏనుగు ఖుషీ అయితే ఎలా ఉంటుందో తెలుసా’’.. అంటూ కామెంట్లు చేస్తు్న్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఏనుగుపై గడ్డి మోపును వేసుకుని రోడ్డుపై వెళ్తుంటాడు. దారిలో మెల్లగా నడుచుకుంటూ వస్తున్న ఏనుగను అంతా ఆసక్తిగా గమనిస్తుంటారు. ఇంతలో ఓ ఆశ్చర్యకర గన చోటు చేసుకుంది. అక్కడే ఉన్న ఓ యువకుడు ఏనుగును చూసి ముచ్చటపడ్డాడు. తన వంతుగా ఎంతో కొంత ఆహారాన్ని దానికి అందించాలని అనుకుంటాడు.

Puzzle: ఏ గ్లాసులో నీరు ఎక్కువ ఉందో 25 సెకన్లలో చెప్పగలిగితే.. మీలో ఐక్యూ పవర్ ఎక్కువ ఉన్నట్లే..


చివరకు అక్కడే ఉన్న అరటిపండ్ల వ్యాపారి వద్దకు వెళ్లి.. అరటి గెలలో కొంత భాగాన్ని కొంటాడు. దాన్ని తీసుకుని ఏనుగుకు ఎదురుగా రోడ్డుపై పెడతాడు. అయితే అటుగా వచ్చిన ఏనుగు అరటి గెల దాటుకుని కాస్త ముందుకు వెళ్తుంది. అంతలో ఉన్నట్టుండి దాన్ని గమనించి ‘‘అరే.. నోరూరించే అరటి గెలను గమనించకుండా వెళ్తున్నానే’’.. అనుకుంటూ సడన్‌గా మళ్లీ వెనక్కు వచ్చి దాన్ని నోట్లోకి తీసుకుంటుంది. ఆ తర్వాత దాన్ని ఎంతో (elephant ate a bunch of bananas) ఇష్టంగా నములుతూ వెళ్తుంది. ఆ సమయంలో ఏనుగు మొఖం సంతోషంతో నిండిపోయినట్లుగా కనిపిస్తుంది.

Viral Video: వామ్మో.. దఢ పుట్టిస్తున్న వీడియో.. ఖడ్గమృగాన్ని ఈ సింహం ఎలా తింటుందో చూస్తే..


ఏనుగు సంతోషం చూసి ఆ యువకుడు కూడా ఎంతో ఆనందిస్తాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘జంతువులకు ఇలా ఆహారం అందివ్వడం మంచి సాంప్రదాయం.. అంతా ఇలాగే చేస్తే ఎంతో బాగుంటుంది’’.. అంటూ కొందరు, ‘‘ఏనుగు సంతోషం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది’’.. అంటూ మరికొందరు, ‘‘ప్రతి ఒక్కరూ ఇతన్ని ఆదర్శంగా తీసుకోవాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 43 వేలకు పైగా లైక్‌లు, 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈగలకు తెలీకుండా తేనె చోరీ.. ఇతడి టెక్నిక్ ఏంటో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈగలకు తెలీకుండా తేనె చోరీ.. ఇతడి టెక్నిక్ ఏంటో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 19 , 2024 | 01:55 PM