Share News

Viral video: ‘‘ఒసేయ్ రాములమ్మ’’ను మించిపోయిందిగా.. ఈమె విన్యాసం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Jun 21 , 2024 | 09:41 PM

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రస్తుతం చాలా మంది మహిళలు వివిధ రకాల విన్యాసాలు చేయడం చూస్తున్నాం. కొందరు రైళ్లు, బస్సుల్లో డాన్సులు చేస్తుంటే.. మరికొందరు...

Viral video: ‘‘ఒసేయ్ రాములమ్మ’’ను మించిపోయిందిగా.. ఈమె విన్యాసం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రస్తుతం చాలా మంది మహిళలు వివిధ రకాల విన్యాసాలు చేయడం చూస్తున్నాం. కొందరు రైళ్లు, బస్సుల్లో డాన్సులు చేస్తుంటే.. మరికొందరు ఎత్తైన భవనాలపై ప్రమాదకర విన్యాసాలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఓ మహిళ వినూత్న ప్రయోగానికి సంబంధించి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ తలపై గ్యాస్ సిలిండర్లు పెట్టుకుని చేసిన వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ‘‘ఒసే రాములమ్మ’’.. సినిమా చూసి ఇన్‌స్పైర్ అయిందో ఏమో గానీ.. అంత కంటే వెరైటీగా చేసి సోషల్ మీడియాలో వైరల్ కావాలని నిర్ణయించుకంది. ఇందుకోసం ఆమె ఏకంగా గ్యాస్ సిలిండర్లను ఎంచుకుంది. తన తలపై మొత్తం (woman lifts gas cylinders on head) రెండు గ్యాస్ సిలిండర్లను పెట్టుకుంది. అవి చాలవన్నట్లు వాటిపై మరో ఓ కడవను కూడా పెట్టుకుంది.

Viral video: వామ్మో..! ఇతను మనిషా.. లేక మరమనిషా.. ఆటో మోయాల్సిన మూటలను...


వాటిని తలపై మోయడమే కాకుండా చిన్నపాటి స్టెప్పులు కూడా వేసింది. డాన్స్ వేస్తూ అటూ ఇటూ తిరుగుతూ తలపై ఉన్న గ్యాస్ సిలిండర్లను బ్యాలెన్స్ చేసింది. ఒక సిలిండర్ మోయడమే కష్టం అనుకుంటే.. ఈమె ఏకంగా రెండు సిలిండర్లతో పాటూ మరో కడవను కూడా మోసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె టాలెంట్ మామూలుగా లేదుగా’’... అంటూ కొందరు, ‘‘జాగ్రత్తమ్మా.. ఇలాంటి విన్యాసాలు చేయడమం ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 57వేలకు పైగా లైక్‌లను సొంత చేసుకుంది.

Viral video: నీళ్లలో నడుస్తుండగా షాకింగ్ సీన్.. రాయిలా మెరుస్తూ ఉండడంతో కాలితో తొక్కి చూడగా..

Updated Date - Jun 21 , 2024 | 10:16 PM