Viral video: బస్సు కింద పడుకుని యువకుడి డేంజరస్ స్టంట్.. అసలు విషయం తెలుసుకుని మండిపడుతున్న నెటిజన్లు..
ABN , Publish Date - Jun 21 , 2024 | 05:37 PM
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎలాంటి సంఘటననైనా కొందరు తమకు అనుకూలంగా మార్చుకుని మాయ చేస్తుంటారు. ఈ క్రమంలో మరికొందరు వ్యూస్, లైక్‌ల కోసం చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి...
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎలాంటి సంఘటననైనా కొందరు తమకు అనుకూలంగా మార్చుకుని మాయ చేస్తుంటారు. ఈ క్రమంలో మరికొందరు వ్యూస్, లైక్‌ల కోసం చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి చర్యలు కొన్నిసార్లు ఇతరులకు ప్రమాకరంగా మారుతుంటాయి. ఇంకొన్నిసార్లు ఇలాంటి వారిని అనుసరించి ఇంకొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి బస్సు కింద పడుకుని డేంజరస్ స్టంట్ చేసినట్లుగా కనిపించింది. అయితే చివరకు అసలు విషయం తెలుసుకుని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న ఓ రోడ్డుపై ఓ యువకుడు డేంజరస్ స్టంట్ చేసేందుకు సిద్ధమవుతాడు. దూరంగా బస్సు రావడం చూసిన సదరు యువకుడు.. నేరుగా దానికి ఎదురుగా వెళ్తాడు. బస్సు సమీపానికి (man sleeping under running bus) రాగానే ఒక్కసారిగా బోర్లా పడిపోతాడు. దీంతో బస్సు అతడి మీదుగా వెళ్లిపోతుంది. ఆ తర్వాత అతను తాపీగా పైకి లేచి అక్కడి నుంచి రోడ్డు పక్కకు వెళ్లిపోతాడు.
Viral video: ఆపరేషన్ చేస్తుండగా వైద్యులకే షాక్ ఇచ్చిన మహిళ.. మధ్యలో ఉన్నట్టుండి..
అయితే ఈ వీడియోను బాగా గమనిస్తే.. ఫేక్ (Fake video) అని తెలిసిపోతుంది. గ్రీన్ మ్యాట్‌లో నడుస్తున్నట్లు, పడుకున్నట్లుగా చిత్రీకరించుకుని, దాన్ని బస్సు కింద పడుకున్నట్లుగా ఎడిట్ చేశారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని చూసి మిగతా వారు కూడా రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే వారిని కఠింనగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.