Share News

Viral video: ఆపరేషన్ చేస్తుండగా వైద్యులకే షాక్ ఇచ్చిన మహిళ.. మధ్యలో ఉన్నట్టుండి..

ABN , Publish Date - Jun 20 , 2024 | 08:16 PM

ఆస్పత్రిలో చికిత్స సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రధానంగా ఆపరేషన్ చేసే సమయంలో కడుపులో కొన్నిసార్లు చిత్రవిచిత్ర వస్తువులు కనిపిస్తే.. మరికొన్నిసార్లు ...

Viral video: ఆపరేషన్ చేస్తుండగా వైద్యులకే షాక్ ఇచ్చిన మహిళ.. మధ్యలో ఉన్నట్టుండి..

ఆస్పత్రిలో చికిత్స సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రధానంగా ఆపరేషన్ చేసే సమయంలో కడుపులో కొన్నిసార్లు చిత్రవిచిత్ర వస్తువులు కనిపిస్తే.. మరికొన్నిసార్లు వింత వింత జీవులు కనిపిస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు చికిత్స సమయంలో రోగులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం కూడా చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆపరేషన్ సమయంలో మహిళ చేసిన పనికి వైద్యులు కూడా షాక్ అయ్యారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ గర్భిణి పురిటినొప్పులతో ఆస్పత్రికి వెళ్లింది. దీంతో వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వైద్యులు ఆపరేషన్ చేస్తున్నా ఆమెలో కొంచెం కూడా భయం కనపడలేదు. ఆపరేషన్ జరుగుతుండగా మధ్యలో (woman sings shri krishna song) ఆమె శ్రీ కృష్ణుడి పాట పాడటం మొదలెట్టారు. అది కూడా ఎంతో శ్రావ్యమైన గొంతుతో పాడడంతో వైద్యులంతా ఎంతో ఆసక్తిగా విన్నారు.

Viral video: పిచ్చి పీక్స్‌కు వెళ్లినట్లుంది.. చెట్టుపై ఈ యువతి చేస్తున్న పని చూస్తే.. షాకవ్వాల్సిందే..


ఆపరేషన్ జరుగుతున్నా ఏమాత్రం భయం లేకుండా ఎంతో అందంగా పాట పాడిన ఆమెను అంతా అభినందనంలో ముంచెత్తారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ కొందరు, ‘‘ఎంతో వినసొంపుగా పాడారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 లక్షలకు పైగా లైక్‌‌లను సొంతం చేసుకుంది.

Viral video: తల్లి ఊయల ఊపుతుండగా.. లోపలికి వచ్చిన అనుకోని అతిథి.. చివరకు..

Updated Date - Jun 20 , 2024 | 08:18 PM