Share News

Viral video: ఎత్తైన భవనంపై స్టంట్ చేసిన యువతికి.. పోలీసుల షాక్..

ABN , Publish Date - Jun 21 , 2024 | 07:41 PM

ఎత్తైన భవనంపై ఓ యువతి డేంజరస్ స్టంట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఓ యువకుడు ఆమెను చేత్తో పట్టుకోగానే.. అతడి సాయంతో యువతి చాలా సేపు గాల్లో వేలాడుతోంది. ఈ వీడియో..

Viral video: ఎత్తైన భవనంపై స్టంట్ చేసిన యువతికి.. పోలీసుల షాక్..

ఎత్తైన భవనంపై ఓ యువతి డేంజరస్ స్టంట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఓ యువకుడు ఆమెను చేత్తో పట్టుకోగానే.. అతడి సాయంతో యువతి చాలా సేపు గాల్లో వేలాడుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. చివరకు ఇది పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో చివరకు పోలీసు అధికారులు సదరు యువతీయువకులు గట్టి షాక్ ఇచ్చారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra) పూణేలోని భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలిసింది. ఓ యువతి (young woman) ఓ పాడు పడ్డ పెద్ద భవనంపై (Dangerous stunts on building) డేంజరస్ స్టంట్ చేసింది. ఓ యువకుడు బిల్డింగ్ పైన పడుకుని ఆమెను పట్టుకోగా.. అతడి సాయంతో ఆమె చాలా సేపు వేలాడుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చింది. మరో యువకుడు వీరిని వీడియో తీస్తూ కనిపించాడు.

Viral video: బస్సు కింద పడుకుని యువకుడి డేంజరస్ స్టంట్.. అసలు విషయం తెలుసుకుని మండిపడుతున్న నెటిజన్లు..


ఈ క్రమంలో ఏమాత్రం పట్టు తప్పినా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. చివరకు ఈ వీడియోపై భారతి విద్యాపీఠ్ పోలీసులు స్పందించారు. వారిని మిహిర్ గాంధీ (27), అతని స్నేహితురాలు మినాక్షి సలుంఖే (23)గా గుర్తించారు. సదరు యువతిని, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు అధికారులు మాట్లాడుతూ రీల్స్ కోసం ఇలాంటి ప్రమాదర విన్యాసాలు చేయొద్దని చెప్పారు. ఇకపై ఇలాంటి విన్యాసాలు చేస్తూ కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Love Story: స్నేహితుడు పిలిచాడని ఆస్పత్రికి వెళ్లాడు.. రాత్రికి రాత్రే అమ్మాయిగా మారాడు.. చివరకు..

Updated Date - Jun 21 , 2024 | 07:41 PM