Share News

Viral Video: వామ్మో.. బ్యాక్ టైరు లేకుండానే బైకు విన్యాసం.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Oct 14 , 2024 | 09:14 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు బైకుపై విన్యాసం చేసేందుకు ముందుకొచ్చాడు. అయితే అందరిలా కాకుండా వినూత్న విన్యాసం చేయాలని నిర్ణయించుకున్న అతను.. చివరకు బైకు వైనుక భాగాన్ని గాల్లోకి లేపాడు. అయితే..

Viral Video: వామ్మో.. బ్యాక్ టైరు లేకుండానే బైకు విన్యాసం.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ప్రస్తుతం చాలా మంది యువకులు పది మందిలో గుర్తింపు కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకొందరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది బైకుపై విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి మరీ ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అంతా షాక్ అయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు బ్యాక్ టైరు లేకుండా బైకుపై ప్రమాదకర విన్యాసం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు బైకుపై విన్యాసం (Bike stunts) చేసేందుకు ముందుకొచ్చాడు. అయితే అందరిలా కాకుండా వినూత్న విన్యాసం చేయాలని నిర్ణయించుకున్న అతను.. చివరకు బైకు వైనుక భాగాన్ని గాల్లోకి లేపాడు. అయితే అలా బైకును పైకి లేపగానే వెనుక టైరు ఊడి పక్కకు వెళ్లిపోయింది.

Viral Video: స్కూటీతో దుస్తుల వాషింగ్.. ఇతడి తెలివి మామూలుగా లేదుగా..


ఇలా వెనుక టైరు లేకుండానే ఆ వ్యక్తి.. (Bike stunts without rear tire) కేవలం ముందు టైరుపై బండిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లాడు. మరోవైపు దొర్లుకుంటూ వెళ్తున్న వెనుక చక్రంతో అక్కడున్న వారు టైరు ఆట ఆడుకున్నారు. బైకర్ మాత్రం ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా అలా ముందు టైరుపైనే ముందుకు వెళ్లాడు. మధ్యలో మలుపులు ఉన్నా, వాహనాలు ఎదురైనా కూడా బండిని మాత్రం ఎంతో చాకచక్యంగా నడుపుతూ రోడ్డు చివరి వరకూ తీసుకెళ్లాడు.

Viral Video: కారులో కూర్చుని ఖంగుతిన్న వ్యక్తి.. డోరు వేయాలని చూడగా.. షాకింగ్ సీన్..


ఈ సమయంలో ఏమాత్రం అదుపు తప్పినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయినా ఆ వ్యక్తి మాత్రం బండిని ఎంతో బ్యాలెన్స్‌గా నడపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇతడి ప్రమాదకర విన్యాసం చూసి అంతా అవాక్కయ్యారు. అతడి స్నేహితులు ఈ విన్యాసాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 7.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గుర్రానికి షాక్ ఇచ్చిన పొట్టేలు.. చివరికి ఏం చేసిందో చూస్తే.. అవాక్కవాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 14 , 2024 | 09:14 AM