Share News

Viral Video: గజరాజా మజాకా.. ఈ ఏనుగు దూరం నుంచే సింహాలను ఎలా భయపెట్టిందో చూస్తే..

ABN , Publish Date - Oct 13 , 2024 | 04:46 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న మూడు సింహాలు వేట కోసం వెతుకుతుంటాయి. ఇంతలో వాటికి ఓ గేదె కనిపిస్తుంది. ఇంకేముందీ వెంటనే దానిపై దాడికి దిగుతాయి. అయితే ఈ సమయంలో ఓ ఏనుగు అటుగా వస్తుంది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: గజరాజా మజాకా.. ఈ ఏనుగు దూరం నుంచే సింహాలను ఎలా భయపెట్టిందో చూస్తే..

అడవికి రాజు సింహమే అయినా గజరాజైన ఏనుగును చూస్తే తోక ముడవాల్సిందే. ఎన్ని సింహాలన్నీ కలిసినా ఏనుగును కనీసం టచ్ కూడా చేయలేవంటే అతిశయోక్తి కాదు. ఏనుగులను దూరం నుంచి చూసినా చాలు.. పులులు, సింహాలన్నీ సైడైపోతుంటాయి. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సింహాలు గేదెపై దాడి చేసి చంపేస్తుండగా.. మధ్యలో ఏనుగు అటుగా వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న మూడు సింహాలు వేట కోసం వెతుకుతుంటాయి. ఇంతలో వాటికి ఓ గేదె కనిపిస్తుంది. ఇంకేముందీ వెంటనే (Lions attack on buffalo) దానిపై దాడికి దిగుతాయి. తమ పంజా దెబ్బతో కిందపడేసి తినేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral Video: అందమైన అమ్మాయి బైకు ఆపిందని సంబరపడ్డాడు.. చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి అవాక్కయ్యాడు..


అటుగా వెళ్తున్న ఓ ఏనుగు.. సింహాలు దాడి చేయడం చూసి సమీపానిక వెళ్తుంది. కాస్త దూరంలో నిలబడగి ఒక్కసారిగా ఘీంకరించి తన ఒళ్లు వదిలిస్తుంది. ఇది చూడగానే సింహాలన్నీ (lions ran away after seeing the elephant) భయంతో అక్కడి నుంచి పారిపోతాయి. ఇలా గేదెను సింహాల బారి నుంచి కాపాడుతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు.

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వివిధ వేదికల్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహాలకు చుక్కలు చూపించిన ఏనుగు’’.. అంటూ కొందరు, ‘‘గజరాజుతో మామూలుగా ఉండదు మరి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. wildtrails.in అనే ఇన్‌స్టా్గ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 41 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: ఎల్‌ఈడీ బల్బుకు హైసెక్యూరిటీ.. వీళ్ల అతి తెలివి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 13 , 2024 | 04:46 PM