Share News

Viral Video: స్కూటీతో దుస్తుల వాషింగ్.. ఇతడి తెలివి మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Oct 13 , 2024 | 08:14 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి దుస్తులను వినూత్నంగా ఉతికి అంతా అవాక్కయ్యేలా చేశాడు. ముందుగా ఇతను పాత బట్టలను పారుతున్న కాలువలో ఒక్కొక్కటిగా పడేశాడు. ఆపై నీటిలో సర్ఫ్‌ను కూడా పోశాడు. అవి నీటిలో కొట్టుకుంటూ వెళ్లి..

Viral Video: స్కూటీతో దుస్తుల వాషింగ్.. ఇతడి తెలివి మామూలుగా లేదుగా..

అందుబాటులో ఉన్న వస్తువులతో కొందరు వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. మరికొందరు వాహనాలతో ఎవరూ చేయని ప్రయోగాలు చేస్తుంటారు. బైకు ఇంజిన్‌ను మోటారులా వాడుతూ బావిలోని నీళ్లను తోడుతూ కొందరు, కుట్టు మిషన్‌ను రన్ చేయడం.. తదితర పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి స్కూటీ సాయంతో దుస్తులు ఉతకడం చూసి నెటజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి దుస్తులను వినూత్నంగా ఉతికి అంతా అవాక్కయ్యేలా చేశాడు. ముందుగా ఇతను పాత బట్టలను పారుతున్న కాలువలో ఒక్కొక్కటిగా పడేశాడు. ఆపై నీటిలో సర్ఫ్‌ను కూడా పోశాడు. అవి నీటిలో కొట్టుకుంటూ వెళ్లి కాస్త దూరంలో ఏర్పాటు చేసిన బకెట్‌లోకి చేరాయి.

Viral Video: అరటి, యాపిల్, జామపండుతో ఇతడు చేసిన ప్రయోగం చూస్తే.. ఖంగుతినాల్సిందే..


తర్వాత బకెట్ మూత మూసేసి, మళ్లీ అందులో మిగిలిన సర్ఫ్ పొడిని వేశాడు. చివరగా ప్లాస్టిక్ బకెట్‌ పక్కనే (man washing clothes with the help of scooty) ఉన్న స్కూటీని స్టార్ట్ చేశాడు. దాని వెనుక టైరు గిర్రున తిరగడం వల్ల బకెట్ కూడా గిరగిరా తిరుగుతోంది. తద్వారా పాత బట్టలు కాస్త.. కాసేపటికి కొత్తగా మారాయన్నమాట. ఇలా దుస్తులను ఉతకడంలో వినూత్న పద్ధతిని అవలంభించిన ఈ వ్యక్తిని చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: అరటిపండును ఎలా తినాలో.. ఈ కోతిని చూసి నేర్చుకోవాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇక ఇళ్లల్లోని వాషింగ్ మెషిన్లను బయటపడేయొచ్చు’’.. అంటూ కొందరు, ‘‘బట్టలు ఉతకడం ఏమోగానీ.. నీళ్లన్నింటినీ కలుషితం చేస్తున్నాడుగా’’.. అంటూ మరికొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 6.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గజరాజా మజాకా.. ఈ ఏనుగు దూరం నుంచే సింహాలను ఎలా భయపెట్టిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 13 , 2024 | 08:14 PM