Share News

Viral Video: ఇలాంటి చోరీ ఎక్కడైనా చూశారా.. రోడ్డు పక్కన స్కూటీ ఆపి.. సమీపంలోని గేటు వద్దకు వెళ్లి..

ABN , Publish Date - Aug 17 , 2024 | 08:28 PM

చోరీలు జరిగే తీరు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్నిసార్లు ఇలాంటి చోరీలు కూడా జరుగుతాయా.. అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి వింత చోరీలన్నీ బయటపడుతున్నాయి. ఇలాంటి ..

Viral Video: ఇలాంటి చోరీ ఎక్కడైనా చూశారా.. రోడ్డు పక్కన స్కూటీ ఆపి.. సమీపంలోని గేటు వద్దకు వెళ్లి..

చోరీలు జరిగే తీరు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్నిసార్లు ఇలాంటి చోరీలు కూడా జరుగుతాయా.. అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి వింత చోరీలన్నీ బయటపడుతున్నాయి. ఇలాంటి చిత్రవిచిత్రమైన చోరీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తూ ఉన్నట్టుండి రోడ్డు పక్కన ఆపేశాడు. పక్కనే ఉన్న గేటు వద్దకు వెళ్లి అతడు చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆగ్రాలోని (Agra) పార్శ్వనాథ్ ప్రేరణ సొసైటీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగస్టు 15న ఓ వ్యక్తి స్కూటీపై అటుగా వెళ్తూ సడన్‌గా రోడ్డు పక్కన ఆపేశాడు. అక్కడే ఉన్న ఓ గేటు వద్దకు వెళ్లి నిలబడ్డాడు. ఏం చేస్తున్నాడబ్బా.. అని గమనిస్తే, ఆ గేటుపై ఆరేసిన మహిళ దుస్తులపై కన్నేశాడు.

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..


కాసేపు అక్కడే నిలబడి చుట్టూ ఎవరన్నా ఉన్నారేమో అని గమనిస్తాడు. ఎవరూ తనను గమనించలేదని నిర్ధారించుకున్న తర్వాత.. అక్కడ ఆరేసిన వాటిలో లోదుస్తులను చేతిలోకి (biker stole a woman's undergarments) తీసుకుని తీసుకుని వాసన చూశాడు. తర్వాత వాటిని తన స్కూటీలోని సీటు కింద వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో చూసిన సదరు ఇంటి యజమానులు షాక్ అయ్యారు.

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. వెంటనే ఈ ఘటనపై విచారించి చర్యలు తీసుకోవాలని తాజ్‌గంజ్ పోలీసును ఆదేశించారు. దీంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటివి కూడా చోరీ చేస్తారా’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. ఇలాంటి చోరీ ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: మెట్రో రైలు డోర్లు మూసుకుపోయే సమయంలో.. సడన్‌గా ఎలా ఎంట్రీ ఇచ్చాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: మెట్రో రైలు డోర్లు మూసుకుపోయే సమయంలో.. సడన్‌గా ఎలా ఎంట్రీ ఇచ్చాడో చూడండి..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 17 , 2024 | 08:28 PM