Viral Video: ఒక ఏసీతో రెండు అంతస్తుల్లో కూలింగ్.. ఇతడి టెక్నిక్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Jul 21 , 2024 | 09:30 PM
కొందరికి ఎవరికీ రాని ఐడియాలు వస్తుంటాయి. కొందరు పాత వస్తువులతో కొత్త కొత్త ప్రయోగాలు చేసి వాటిని సరికొత్తగా తయారు చేస్తుంటారు. ఇంకొందరు ఇళ్లల్లోని కూలర్లు, ఫ్రిడ్జిలు, ఫ్యాన్లపై ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ...
కొందరికి ఎవరికీ రాని ఐడియాలు వస్తుంటాయి. కొందరు పాత వస్తువులతో కొత్త కొత్త ప్రయోగాలు చేసి వాటిని సరికొత్తగా తయారు చేస్తుంటారు. ఇంకొందరు ఇళ్లల్లోని కూలర్లు, ఫ్రిడ్జిలు, ఫ్యాన్లపై ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరి ఐడియాలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఒక ఏసీతో రెండు అంతస్తుల్లో కూలింగ్ వచ్చేలా ఏర్పాట్లు చేశాడు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని ఓ గదిలో ఏసీని అమర్చాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. అతను ఏసీని వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. కింద ఫ్లోర్లో ఏసీని ఏర్పాటు చేసిన ఆ వ్యక్తి.. పై అంతస్తులో కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అయితే దానికి మళ్లీ ఇంకో ఏసీని కొనే పని లేకుండా.. ఉన్న ఏసీతోనే సరిపెట్టాలని భావించాడు.
Viral Video: గోడపై గాడిద పెయింటింగ్.. నిజమని నమ్మిన ఈ గాడిద.. దగ్గరికి వెళ్లి..
ఇందుకోసం చివరకు విచిత్రమైన ప్రయోగం చేశాడు. ఏసీ ఉన్న గదికి, పై అంతస్తులోని గది మధ్య రంధ్రం ఏర్పాటు చేశాడు. ఆ రంధ్రానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ (Exhaust fan) బిగించాడు. ఆ ఫ్యాన్ తిరగడం ద్వారా ఏసీ ఉన్న గదిలోని చల్లదనం పైఅంతస్తులోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశాడు. ఇలా ఒక ఏసీతో రెండు అంతస్తుల్లో (Cooling on two floors with one AC) చల్లదనం వచ్చేలా ప్రయోగం చేశాడు.
Viral Video: నడి రోడ్డుపై జింకను చుట్టేసిన కొండచిలువ.. చంపేసే సమయంలో ఉన్నట్టుండి..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.