Share News

Viral Video: ఎయిర్‌పోర్టులో సూట్‌కేస్‌తో షాకిచ్చిన యువతి.. ఆమె తింటున్నదేంటో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Sep 06 , 2024 | 09:38 PM

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చాలా మంది మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు చేసే ప్రయోగాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరు ఇలాంటి ప్రయోగాలతో చేసే ప్రాంక్ వీడియోలు అందరినీ తెగ నవ్వి్స్తుంటాయి. ఇలాంటి..

Viral Video: ఎయిర్‌పోర్టులో సూట్‌కేస్‌తో షాకిచ్చిన యువతి.. ఆమె తింటున్నదేంటో చూస్తే నోరెళ్లబెడతారు..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చాలా మంది మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు చేసే ప్రయోగాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరు ఇలాంటి ప్రయోగాలతో చేసే ప్రాంక్ వీడియోలు అందరినీ తెగ నవ్వి్స్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. విమానాశ్రయంలో సదరు యువతి సూట్ కేస్‌తో అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె తింటున్నదేంటో చూసి అంతా నోరెళ్లబెట్టారు. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) విమానాశ్రయానికి ట్రాలీ సూట్‌‌కేస్‌తో వెళ్లింది. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నా.. ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కయ్యారు. సూట్‌కేసును లాక్కుంటూ వెళ్లి ప్రయాణికుల మధ్యలో కూర్చున్న యువతి.. కాసేపటి తర్వాత సూట్‌కేస్ (young woman ate the suitcase) పైభాగాన్ని చేతితో పీక్కుని తినేసింది.

Viral Video: హృదయాలను గెలుచుకున్న ట్రాఫిక్ పోలీస్.. వాహనాలు పార్క్ చేయకుండా.. ఏం చేశాడంటే..


సదరు యువతి ఇలా చేయడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఆమె అక్కడితో ఆగకుండా అంతా చూస్తుండగా.. దాన్ని ఇలా పీకేసి, అలా నోట్లో వేసుకుని నమలడం మొదలెట్టింది. తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో అటూ, ఇటూ తిరుగుతూ సూట్‌కేస్‌ను కొంచెం కొంచెంగా తింటోంది. ఈమె నిర్వాకం చూసి మొదట అంతా అవాక్కయినా.. తర్వాత విషయం తెలుసుకుని నవ్వుకున్నారు. చివరగా ఆ యువతి ఓ చోట ఆగి అక్కడున్న వారందరికీ అసలు విషయం రివీల్ చేసింది. కేక్‌‌లతో తయారు చేసిన ఆ సూట్‌కేస్‌ను చూపిస్తూ అందరికీ కేక్‌ను కూడా పంచి పెట్టింది. దాన్ని టేస్ట్ చేసిన మిగతా యువతులంతా.. ‘‘ఈ సూట్‌కేస్ చాలా టేస్టీగా ఉంది’’.. అంటూ కెమెరాకు ఫోజులు ఇచ్చారు.

Viral Video: ప్లాట్‌ఫామ్‌పై రీల్ చేస్తున్న యువకుడు.. అప్పుడే రైలు దిగుతున్న వృద్ధుడు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..


ఇలా ఆ యువతి కేక్‌తో తయారు చేసిన (suitcase made of cake) సూట్‌కేస్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దీన్ని తయారు చేసిన విధానం ఎంతో బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ కేక్ చాలా కొత్తగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. మొత్తానికి గుర్రం లేకుండానే నడిపించాడుగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 06 , 2024 | 09:47 PM