Share News

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. మొత్తానికి గుర్రం లేకుండానే నడిపించాడుగా..

ABN , Publish Date - Sep 06 , 2024 | 07:21 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో టాలెంట్ ఉండేవారికి ఉపాధితో పాటూ పేరుప్రఖ్యాతలు కూడా ఎంతో సులభంగా వచ్చేస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఏదో ఒక విన్యాసం చేయడం, లేదా వింత ప్రయోగం చేయడం ద్వారా నెట్టింట ఫేమస్ కావాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి..

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. మొత్తానికి గుర్రం లేకుండానే నడిపించాడుగా..
man making Jatka cart with old bike

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో టాలెంట్ ఉండేవారికి ఉపాధితో పాటూ పేరుప్రఖ్యాతలు కూడా ఎంతో సులభంగా వచ్చేస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఏదో ఒక విన్యాసం చేయడం, లేదా వింత ప్రయోగం చేయడం ద్వారా నెట్టింట ఫేమస్ కావాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి గుర్రం లేకుండానే జట్కా బండిని నడిపించాడు. ఇతడి వాహనాన్ని చూసి నెటిజన్లు అవాక్కతుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి జట్కా బండి (Jatka cart) తరహాలో సరికొత్త వాహనాన్ని తయారు చేయాలని అనుకున్నాడు. అయితే గుర్రం స్థానంలో వాహనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం చివరకు ఓ పాత బైకును (old bike) తీసుకున్నాడు. తర్వాత జట్కా బండి తరహాలో రెండు సైకిల్ చక్రాలతో వెనుక భాగాన్ని తయారు చేశాడు.

Viral Video: వెల్లుల్లిని ఒలిచేందుకు ఇబ్బంది పడుతున్నారా.. వీళ్లు వాడిన ట్రిక్ చూస్తే..


దాన్ని బైకు వెనుక వైపు జాయింట్ చేసి, చివరకు ఇలా టెక్కాలజీతో కూడిన జట్కా బండిని సిద్ధం చేశాడు. గుర్రాన్ని తోలుతున్న ఫీలింగ్ రావడం కోసం బైకు స్టీరింగ్ రెండు వైపులా తాళ్లు కట్టేశాడు. అలాగే బస్సు గేర్ తరహాలో సీటు పక్కనే ఓ ఇనుప రాడ్‌ను కూడా ఫిట్ చేశాడు. దాన్ని హ్యాండ్ బ్రేక్‌లా వాడుతున్నాడు. ఫైనల్‌గా వెనుక వైపు ఉన్న సీట్లో కూర్చుని, తాళ్ల సాయంతో వాహనం స్టీరింగ్‌‌ను కంట్రోల్ చేస్తున్నాడు. అదేవిధంగా కాళ్ల కింద అమర్చిన ఎక్సలేటర్ ద్వారా వాహనాన్ని నడుపుతున్నాడు. ఇలా అతడు వినూత్న వాహనంతో రోడ్డుపై వెళ్లడం చూస్తుంటే.. ‘‘గుర్రం లేకుండానే జట్కా బండి నడుస్తోందే’’.. అన్నట్లుగా అనిపిస్తుంది.

Viral Video: వామ్మో.. ఒళ్లు జలదరించే సీన్.. మూడు పాములను మింగిన కింగ్ కోబ్రా.. చివరకు..


అతను ఈ విచిత్ర వాహనంపై వెళ్తుండగా.. మిగతా వాహనదారులు అతన్ని విచిత్రంగా చూస్తున్నారు. కొందరు ఇతడి ప్రయోగం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రపంచంలోని మేధావులంతా తమిళనాడులో మాత్రమే ఉన్నారు’’.. అంటూ కొందరు, ‘‘మీకు మంచి భవిష్యత్ ఉంటుంది బ్రదర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఒకే చెప్పు ఉందని పక్కన పడేస్తున్నారా.. ఇతడు ఎలా వాడేశాడో చూస్తే.. ఖంగుతింటారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 06 , 2024 | 07:21 PM