Share News

T20 World Cup: టీమిండియాను ఆశ్చర్యపర్చిన బీసీసీఐ..రోహిత్ రియాక్షన్ ఇదే..

ABN , Publish Date - Jul 04 , 2024 | 10:05 PM

విశ్వవిజేతలు అడుగుపెట్టిన ఆ క్షణంలో మైదానమంతా పులకించిపోయింది. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు స్పందించాయి. కొన్ని గంటల పాటు ముంబయి నగరం జన సునామీని తలపించింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో వాణిజ్య రాజధాని నిండిపోయింది.

T20 World Cup: టీమిండియాను ఆశ్చర్యపర్చిన బీసీసీఐ..రోహిత్ రియాక్షన్ ఇదే..
Team India

విశ్వవిజేతలు అడుగుపెట్టిన ఆ క్షణంలో మైదానమంతా పులకించిపోయింది. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు స్పందించాయి. కొన్ని గంటల పాటు ముంబయి నగరం జన సునామీని తలపించింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో వాణిజ్య రాజధాని నిండిపోయింది. టీ20 ప్రపంచకప్ సాధించి ముంబై గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టుకు యావత్ భారతం ఘన స్వాగతం పలికింది. ముంబై మహానగరంలో భారీ విజయోత్సవ ర్యాలీ అనంతరం భారత క్రికెట్ జట్టు వాంఖడే స్టేడియానికి చేరుకుంది. అప్పటికే మైదనామంతా జనసంద్రాన్ని తలపించింది. టీ20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టును బీసీసీఐ ఘనంగా సత్కరించింది. 17 ఏళ్ల తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్‌ అందించిన జట్టు సభ్యులందరినీ గౌరవిస్తూ ఘనంగా సత్కరించింది.

India Cricket team.jpg


రోహిత్ రియాక్షన్..

టీ20 ప్రపంచకప్‌ గెలుపును సమిష్టి విజయంగా పరిగణించాలని రోహిత్ శర్మ పేర్కొన్నారు. ప్రతి ఆటగాడు, సహాయక సిబ్బంది కృషి ఫలితంగా కప్ సాధించామన్నారు. ఎవరో ఒక ఆటగాడి ఘనతగా ఈ విజయాన్ని చూడలేమన్నారు. టీ20 వరల్డ్ కప్‌ గెలిచిన తర్వాత తాను రిలాక్స్ అయిపోయానన్నారు. ఈ దేశానికి టీ20 ప్రపంచకప్ తీసుకురావడం చాలా ప్రత్యేకమని అన్నారు. విజయోత్సవ ర్యాలీ అద్భుతంగా సాగిందని.. ఘన స్వాగతం పలికిన ముంబై అభిమానులను రోహిత్ ప్రత్యేకంగా అభినందించారు.

1.jpg


స్టేడియంలో హార్దిక్ నినాదాలు..

రోహిత్ శర్మ మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్‌ను ప్రశంసిచారు. దీంతో స్టేడియంలో హార్దిక్-హార్దిక్ నినాదాలు మిన్నంటాయి. హార్దిక్ కూడా లేచి నిలబడి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
2.jpg


కోహ్లి-కోహ్లీ నినాదాలు

రోహిత్, రాహుల్ ద్రవిడ్ తర్వాత మాట్లాడేందుకు విరాట్ కోహ్లీ పోడియం వద్దకు చేరుకోగానే వాంఖడే స్టేడియంలో కోహ్లి-కోహ్లీ నినాదాలు మిన్నంటాయి. ఈ విజయం 140 కోట్ల దేశ ప్రజలదని కోహ్లి అన్నారు. ముంబైలో తమకు ఘన స్వాగతం పలికిన క్రికెట్ అభిమానులకు కోహ్లీ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత తాను, రోహిత్‌ కలిసి పెవిలియన్‌ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని.. ఏడ్చేశామని.. ఆ క్షణం తమకు ఎప్పటికీ ప్రత్యేకమైనదని విరాట్‌ కోహ్లీ అన్నారు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రాకు చప్పట్లు కొట్టాలని అభిమానులను కోహ్లీ కోరడంతో వాంఖడే స్టేడియం మొత్తం బుమ్రా నినాదాలతో మారుమోగింది.

3.jpg

T20 World Cup: టీమిండియా బస్ పరేడ్.. ముంబై బీచ్ వద్ద జనసునామీ


125 కోట్ల నజరానా..

టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్లో చెక్కును వాంఖడే స్టేడింయంలో జరిగిన సత్కార కార్యక్రమంలో అందించారు. భారతజట్టు ఈనెల29వ తేదీన బార్బడోస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో టీమిండియా నాలుగు రోజులు ఆలస్యంగా స్వదేశానికి చేరుకుంది. టీమిండియా సాధించిన విజయానికి బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరాన ప్రకటించింది. గురువారం వాంఖడే స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో జట్టు సభ్యులకు ఈ చెక్కును అందజేశారు.

India Cricket team.jpg

Team India: టీమిండియాకు గ్రాండ్ వెల్ కం


ముంబై మొత్తం భారీ ఫ్లెక్సీలు..

భారత క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం పలుకుతూ ముంబై మహానగరంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ముఖ్యంగా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు చెందిన పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటుచేసి.. తమ స్టార్ ఆటగాళ్లకు ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

Team India.jpg


ఉత్సాహంగా..

టీమిండియా క్రికెట్ జట్టు విజయోత్సవ ర్యాలీలో భాగంగా కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో సహా ఆటగాళ్లందరూ ఓపెన్ టాప్ (ప్రత్యేక) బస్సులో వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గాలిలో ఎగురవేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.


PM Modi: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ఏం మాట్లాడారంటే?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Jul 04 , 2024 | 10:09 PM