Share News

Rishabh Pant: పేరుకే రూ.27 కోట్లు.. పంత్‌కు దక్కేది ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

ABN , Publish Date - Nov 28 , 2024 | 07:25 PM

Rishabh Pant: డాషింగ్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ హవా నడుస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అదరగొడుతున్న ఈ పించ్ హిట్టర్‌ పంట పండింది. ఐపీఎల్ 2025కు ముందు నిర్వహించిన మెగా వేలంలో పంత్ కళ్లుచెదిరే ధరకు అమ్ముడుబోయాడు.

Rishabh Pant: పేరుకే రూ.27 కోట్లు.. పంత్‌కు దక్కేది ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ హవా నడుస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రీఎంట్రీలో అదరగొడుతున్న ఈ పించ్ హిట్టర్‌.. ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ తన దమ్ము ఏంటో చూపిస్తున్నాడు. ఇన్నాళ్లూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతూ వచ్చిన పంత్.. ఈసారి ఆ టీమ్‌ను వీడి మెగా ఆక్షన్ బరిలోకి దిగాడు. వేలంలో అతడి పంట పండింది. ఏకంగా రూ.27 కోట్ల భారీ ధర చెల్లించి లక్నో సూపర్ జియాంట్స్ టీమ్ అతడ్ని సొంతం చేసుకుంది. క్యాష్ రిచ్ లీగ్ ఆక్షన్ హిస్టరీలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఈ లెఫ్టాండ్ బ్యాటర్ రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఈ ఇరవై ఏడు కోట్లలో అన్నీ పోనూ అతడికి దక్కేది ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.


అంత తక్కువా?

వచ్చే సీజన్‌లో పంత్ శాలరీ రూ.27 కోట్లు. అయితే ఆ మొత్తం డబ్బులు అతడి చేతికి రావు. ఇన్‌కమ్ టాక్స్ శ్లాబ్స్ ప్రకారం.. రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ.2 కోట్లకు పైగా ఆదాయం ఉన్నప్పుడు సర్‌ఛార్జ్ 25 శాతం పడుతుంది. దీనికి సెస్ కింద మరో నాలుగు శాతం కూడా యాడ్ అవుతుంది. ఇవన్నీ పోనూ రూ.27 కోట్లలో పంత్‌కు దక్కేది కేవలం 16.47 కోట్లు మాత్రమేనని తెలుస్తోంది. రిషబ్‌తో పాటు వేలంలో భారీ ధర పలికిన శ్రేయస్ అయ్యర్‌కు కూడా దక్కేది ఇంచుమించుగా ఇంతే అమౌంట్ అని సమాచారం.


బిగ్ ఛాలెంజ్

పంత్‌ను లక్నో సూపర్ జియాంట్స్ దక్కించుకోగా.. శ్రేయస్ అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ ఎగరేసుకుపోయింది. ఆక్షన్‌లో ఇంత భారీ ధర పలకడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంత బిగ్ అమౌంట్‌కు బిడ్ అయినా వాళ్లకు అందులో సగం కంటే కాస్త ఎక్కువ డబ్బులే అందుతాయని తెలుస్తోంది. దీన్ని పక్కనబెడితే వేలంలో కొత్త రికార్డులు సృష్టించిన ఈ ఇద్దరు స్టైలిష్ బ్యాటర్లు లీగ్‌లో ఈసారి ఎలా ఆడతారో చూడాలి. ధరకు తగ్గట్లు అటు బ్యాటింగ్‌లో రాణించడంతో పాటు ఇటు టీమ్‌ను ముందుండి నడిపించాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంది. ఈ ఛాలెంజ్‌ను పంత్-అయ్యర్ ఎలా స్వీకరిస్తారో చూడాలి.


Also Read:

రోహిత్, కోహ్లీ కాదు.. ఆ భారత క్రికెటరే స్టార్ అంటున్న ఆస్ట్రేలియా ప్రధాని

జైస్వాల్‌ విషయంలో తప్పు చేశా.. ద్రవిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

చేతిలో కత్తితో సీరియస్‌గా కోహ్లీ.. అంత కోపం ఎవరి మీదంటే..

For More Sports And Telugu News

Updated Date - Nov 28 , 2024 | 07:39 PM