Share News

Rohit Sharma: ఆసీస్‌ను ఆపేందుకు పిచ్చోడ్ని దింపుతున్న రోహిత్.. ఆశలన్నీ అతడి పైనే..

ABN , Publish Date - Dec 07 , 2024 | 07:23 PM

Rohit Sharma: కంగారూ టూర్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన టీమిండియా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మనదే అనే భరోసా ఇచ్చింది. అయితే పెర్త్ టెస్ట్‌లో ఆసీస్‌ను వణికించిన మెన్ ఇన్ బ్లూ.. అడిలైడ్‌లో మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయింది. అయితే టెన్షన్ అక్కర్లేదు.. టీమ్‌లోకి ఓ పిచ్చోడు వస్తున్నాడు.

Rohit Sharma: ఆసీస్‌ను ఆపేందుకు పిచ్చోడ్ని దింపుతున్న రోహిత్.. ఆశలన్నీ అతడి పైనే..

IND vs AUS: కంగారూ టూర్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన టీమిండియా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మనదే అనే భరోసా ఇచ్చింది. పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత జట్టు.. మనకు అడ్డెవరు అనే కాన్ఫిడెన్స్ నింపింది. అయితే అడిలైడ్ టెస్ట్‌కు వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎదురులేదు అనుకున్న రోహిత్ సేన.. పింక్ బాల్ టెస్ట్‌లో ఎదురీదుతోంది. అదే జోరును కొనసాగించలేక తడబడుతోంది. ఓటమి ముంగిట నిలబడిన భారత్.. ఏదైనా అద్భుతం జరిగితే బాగుండని ఆశిస్తోంది. అయితే టెన్షన్ అక్కర్లేదు.. టీమ్‌లోకి ఓ పిచ్చోడు వచ్చేస్తున్నాడు. అతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..


అసలైనోడు వచ్చేస్తున్నాడు

టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్. ఓ పిచ్చోడ్ని దింపుతున్నాడు రోహిత్. ఆసీస్ అహాన్ని అణిచేందుకు, చెలరేగుతున్న కంగారూల బెండు తీసేందుకు సాలిడ్ ప్లేయర్‌ను తీసుకొస్తున్నాడు. అతడు మరెవరో కాదు.. వెటరన్ స్పీడ్‌స్టర్ మహ్మద్ షమి. గాయం నుంచి ఇంకా రికవర్ అవ్వనోడు ఎలా కమ్‌బ్యాక్ ఇస్తున్నాడని సందేహించకండి. వన్డే వరల్డ్ కప్-2023 తర్వాత ఇంజ్యురీ కారణంగా భారత జట్టుకు దూరమయ్యాడు షమి. అనంతరం సర్జరీ చేయించుకొని ఇటీవలే కోలుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడు ఆడటం ఖాయం అనుకుంటున్న వేళ గాయం మళ్లీ తిరగబెట్టిందని వార్తలు వచ్చాయి.


ఫ్లైట్ ఎక్కడమే లేట్

షమి ఆస్ట్రేలియాకు రాకపోవచ్చని చాలా మంది అభిమానులు డిసైడ్ అయిపోయారు. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకున్న పేస్ గన్.. డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడుతూ అదరగొడుతున్నాడు. ఫామ్, ఫిట్‌నెస్ రెండూ ప్రూవ్ చేశాడు. దీంతో అతడ్ని ఆసీస్ ఫ్లైట్ ఎక్కించాలని భారత క్రికెట్ బోర్డు ఫిక్స్ అయిందని తెలుస్తోంది. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయట. షమి రాక కోసం రోహిత్ అండ్ కో కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందని సమాచారం. అతడి వీసా కూడా బీసీసీఐ సిద్ధం చేసిందని.. ఎన్‌సీసీ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంటనే షమి ఆస్ట్రేలియాకు పయనం అవుతాడని వినిపిస్తోంది. ఇది తెలిసిన నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుమ్రాకు జోరుగా షమి లాంటి పేస్ పిచ్చోడు జాయిన్ అయితే కంగారూలకు నరకమే అని కామెంట్స్ చేస్తున్నారు. అతడి బుల్లెట్ పేస్, స్టన్నింగ్ స్వింగింగ్ డెలివరీస్, రివర్స్ స్వింగ్‌ను తట్టుకోవడం ఆస్ట్రేలియా వల్ల కాదని చెబుతున్నారు.


Also Read:

నేను చెప్పిందొకటి.. సిరాజ్‌కు అర్థమైందొకటి: ట్రావిస్ హెడ్

జైస్వాల్‌పై గిల్ సీరియస్.. వినిపించడం లేదా అంటూ..

అంపైర్‌తో గొడవకు దిగిన కోహ్లీ.. ప్రూఫ్స్ చూపించి మరీ..

For More Sports And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 07:31 PM