Share News

Mohammed Shami: షమీని ఎగరేసుకుపోయిన సన్‌రైజర్స్.. కావ్య పాప అనుకున్నది సాధించింది

ABN , Publish Date - Nov 24 , 2024 | 05:17 PM

Mohammed Shami: ఐపీఎల్ వేలంలో పాత రికార్డులన్నీ తుడిచి పెట్టుకుపోతున్నాయి. ఊహించని ధరకు పలుకుతున్నారు స్టార్ ప్లేయర్లు. టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి కూడా మంచి ధర పలికాడు.

Mohammed Shami: షమీని ఎగరేసుకుపోయిన సన్‌రైజర్స్.. కావ్య పాప అనుకున్నది సాధించింది

IPL 2025 Mega Auction: ఐపీఎల్ వేలంలో పాత రికార్డులన్నీ తుడిచి పెట్టుకుపోతున్నాయి. ఊహించని ధరకు పలుకుతున్నారు స్టార్ ప్లేయర్లు. టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి కూడా మంచి ధర పలికాడు. అతడ్ని రూ.10 కోట్ల ధరకు ఎగరేసుకుపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లాంటి సీనియర్ పేసర్లను వదులుకున్న ఎస్‌ఆర్‌హెచ్.. ఇప్పుడు షమీని దక్కించుకుంది. పది కోట్ల లోపు ధరకు ఇంత అనుభవం ఉన్న పేసర్‌ను సొంతం చేసుకోవడం మంచి విషయమనే చెప్పాలి. నిఖార్సయిన పేసర్‌ను తక్కువ ధరకు తీసుకుందామని భావించిన కావ్యా మారన్ అనుకున్నది సాధించింది.


హైలైట్స్ ఇవే..

ఇవాళ ఆక్షన్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ హైలైట్‌గా నిలిచారు. వీళ్లిద్దరూ రికార్డుల పంట పండించాడు. ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా చరిత్ర సృష్టించారు. పంత్‌ను రూ.27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జియాంట్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. అయ్యర్‌ను రూ.26.75 కోట్లు చెల్లించి పంజాబ్ కింగ్స్ కొనుక్కుంది. లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈసారి స్పెషల్ హైలైట్‌గా నిలిచారు. రూ.18 కోట్ల అర్ష్‌దీప్‌ను ఆర్టీఎం కార్డు ద్వారా పంజాబ్ తీసేసుకుంది. అంతే ధరకు చాహల్‌ను అదే జట్టు సొంతం చేసుకుంది. ఆక్షన్‌లో కేఎల్ రాహుల్‌కు నిరాశ మిగిలింది అతడ్ని రూ.14 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది. కనీసం రూ.25 కోట్ల వరకు వస్తాడనుకుంటే చాలా తక్కువ ధరకు అతడు అమ్ముడుపోయాడు. రబాడ (రూ.10.75 కోట్లు)ను గుజరాత్ టైటాన్స్, మహ్మద్ షమి (రూ.10 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్, లియామ్ లివింగ్‌స్టన్ (రూ.8.75 కోట్లు)ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డేవిడ్ మిల్లర్ (రూ.7.5 కోట్లు) లక్నో సూపర్ జియాంట్స్ సొంతం చేసుకున్నాయి.


Also Read:

ఐపీఎల్ ఆక్షన్‌లో కేఎల్ రాహుల్‌కు నిరాశ.. మరీ ఇంత దారుణమా?

షమీని ఎగరేసుకుపోయిన సన్‌రైజర్స్.. కావ్య పాప అనుకున్నది సాధించింది

అభిమానులకు సర్‌ప్రైజ్.. సీక్రెట్‌గా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన స్టార్ ప్లేయర్

For More Sports And Telugu News

Updated Date - Nov 24 , 2024 | 06:19 PM