Dhoni Viral Video: కెమెరామెన్‌ను బెదిరించిన ధోనీ.. ఎందుకంటే..
ABN , Publish Date - Apr 24 , 2024 | 12:31 PM
Watch Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్(CSK) టీమ్ అని చెప్పొచ్చు. దేశంలోని ఏ ప్రాంతంలో సీఎస్‌కే మ్యాచ్ జరిగినా.. అక్కడ ప్రేక్షకులు వాలిపోతుంటారు. సీఎస్‌కే ప్లేయర్స్ బౌండరీలు కొట్టినా.. వికెట్ తీసినా..
Watch Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్(CSK) టీమ్ అని చెప్పొచ్చు. దేశంలోని ఏ ప్రాంతంలో సీఎస్‌కే మ్యాచ్ జరిగినా.. అక్కడ ప్రేక్షకులు వాలిపోతుంటారు. సీఎస్‌కే ప్లేయర్స్ బౌండరీలు కొట్టినా.. వికెట్ తీసినా.. ఎంఎస్ ధోనీని చూసినా చెలరేగిపోతారు. ముఖ్యంగా ధోనీ కనిపిస్తే చాలు.. అభిమానులకు సంబరాలే అన్నట్లుగా ఉంటుంది. అందుకే.. మ్యాచ్‌లో కెమెరామెన్ దృష్టి ఎక్కువగా ధోనీవైపే ఉంటుంది.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ 17లో ధోనీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఎందుకంటే.. నెక్ట్స్ సీజన్‌లో ధోనీ ఆడుతాడా? లేదా? ఇదే చివరి సీజన్ అవుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. అందుకే.. ధోనీ కనిపిస్తే చాలు.. స్టేడియం మోత మోగిపోతోంది. బ్యాటింగ్‌కు దిగినా.. స్టాండ్స్‌లో కనిపించినా.. అల్లరే అల్లరి. అభిమానుల ఆసక్తి కెమెరా మెన్‌లకు బాగా తెలుసు కాబట్టే స్పెషల్‌గా ధోనీపైనే కెమెరా ఫోకస్ చేస్తారు. మంగళవారం నాడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, సీఎస్‌కే టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించినప్పటికీ.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దుమ్మురేపే ఫర్ఫార్మెన్స్‌తో 60 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఆ సమయంలో స్టాండ్స్‌లో మహేంద్ర సింగ్ ధోనీ.. గైక్వాడ్ బ్యాటింగ్‌ను చాలా ఇంట్రస్టింగ్‌గా వీక్షిస్తున్నాడు.
ఇదికూడా చదవండి: మార్కస్ స్టోయినిస్ అరుదైన రికార్డు..
ఈ మ్యాచ్‌లో సిఎస్‌కె కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే అద్భుత భాగస్వామ్యం నెలకొల్పగా.. వీరి ఆట తీరును స్టాండ్స్‌లో ఉండి ధోనీ వీక్షిస్తున్నాడు. ఇంతలో కెమెరామెన్ ధోనీ వైపు లుక్కేశాడు. కెమెరాను ధోనీ వైపు తిప్పాడు. అది గమనించిన ధోనీ.. కాస్త అసహనానికి గురయ్యాడు. తన చేతిలో ఉన్న నీళ్ల బాటిల్‌ను విసురుతూ కొడుతున్నట్లుగా బెదిరించాడు. నీళ్ల బాటిల్‌ను కెమెరా వైపు విసురుతూ భయపెట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదికూడా చదవండి: పాయింట్ల పట్టికలో సంచలన మార్పు..
దుమ్మురేపిన గైక్వాడ్.. తొలి కెప్టెన్‌గా హిస్టరీ క్రియేట్..
గైక్వాడ్ 60 బంతుల్లో అజేయంగా 108 పరుగులు(3 సిక్స్‌లు, 12 ఫోర్స్) చేయడం ద్వారా ఐపిఎల్ చరిత్రలో సెంచరీ సాధించిన మొట్టమొదటి సిఎస్‌కె కెప్టెన్‌గా నిలిచాడు. గైక్వాడ్‌కు అండగా శివమ్ దూబే నిలిచాడు. దూబే 27 బంతుల్లో (3 ఫోర్స్, 7 సిక్సర్లతో) 66 పరుగులు చేసి.. 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇప్పటి వరకు సీఎస్‌కే హిస్టరీ చూసుకుంటే.. 2010లో ధోనీ, బద్రీనాథ్ ఇద్దరూ 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2014లో ధోని, మైక్ హస్సీ 108 పరుగుల తర్వాత IPL చరిత్రలో CSK తరపున ఇది మూడవ అత్యధిక నాల్గవ వికెట్ స్టాండ్.