Share News

Pant-Iyer: పంత్-అయ్యర్‌కు రికార్డు ధర.. అసలు మాస్టర్‌మైండ్ ఇతనే

ABN , Publish Date - Nov 24 , 2024 | 08:19 PM

Pant-Iyer: టీమిండియా స్టార్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌ పంట పండింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు నిర్వహించిన మెగా ఆక్షన్‌లో వీళ్లిద్దరూ కోట్లు కొల్లగొట్టారు. భారీ ధరకు అమ్ముడుబోయారు.

Pant-Iyer: పంత్-అయ్యర్‌కు రికార్డు ధర.. అసలు మాస్టర్‌మైండ్ ఇతనే
IPL 2025 Mega Auction

IPL 2025 Mega Auction: టీమిండియా స్టార్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌‌కు కాసుల పంట పండింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు నిర్వహించిన మెగా ఆక్షన్‌లో ఈ ఇద్దరు స్టైలిష్ బ్యాటర్లు రికార్డు ధరకు అమ్ముడుబోయారు. రూ.26.75 కోట్ల ధరకు అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకోగా.. రూ.27 కోట్ల ధర చెల్లించి పంత్‌ను సొంతం చేసుకుంది లక్నో సూపర్ జియాంట్స్. ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు. అతడి తర్వాత స్థానంలో నిలిచాడు అయ్యర్. అయితే ఈ ఇద్దరు ప్లేయర్లు ఇంత భారీ ధర పలకడంలో వీళ్ల బ్యాటింగ్, కెప్టెన్సీ టాలెంట్‌తో పాటు మరో వ్యక్తి పాత్ర కూడా ఉందని అంటున్నారు. అసలు ఎవరా మాస్టర్‌మైండ్? పంత్-అయ్యర్‌కు అతడు చేసిన సాయం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


అనుకున్నట్లే..

పంత్-అయ్యర్ ఈసారి వేలంలో రికార్డులు సృష్టించడం ఖాయమని అంతా అనుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జియాంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు కెప్టెన్స్ లేకపోవడంతో ఈ ఇద్దరు ప్లేయర్ల కోసం తీవ్ర పోటీ ఉంటుందని అంతా ఊహించారు. అందుకు తగ్గట్లే ఈ నాలుగు ఫ్రాంచైజీలు వీళ్ల కోసం పోటీపడ్డాయి. అయితే ఎట్టకేలకు పంజాబ్ శ్రేయస్‌ను, లక్నో పంత్‌ను దక్కించుకున్నాయి. దీంతో బెంగళూరు మేనేజ్‌మెంట్ కాస్త నిరాశలో కూరుకుపోయింది. కానీ ఢిల్లీ మాత్రం తమకు పోయిందేమీ లేదన్నట్లుగా కనిపించింది.


పక్కా ప్లానింగ్‌తోనే..

పంత్-అయ్యర్ పోయినా కేఎల్ రాహుల్‌ను రూ.14 కోట్ల ధరకు దక్కించుకుంది ఢిల్లీ టీమ్. దీంతో ఆ జట్టు ఓనర్స్‌లోని ఓ వ్యక్తి గురించే అంతా డిస్కస్ చేస్తున్నారు. పంత్-అయ్యర్ కోసం పోటీ పెంచేసి ఆయన వదిలేశారని.. వాళ్లిద్దరూ భారీ ధరకు అమ్ముడుపోయే దాకా కూల్‌గా చూస్తూ ఉన్నారని అంటున్నారు. ఒక్కసారి పంత్-అయ్యర్ అమ్మకం అయిపోయాక రాహుల్ కోసం పోటీలోకి దిగి రూ.14 కోట్లకే దక్కించుకున్నారని చెబుతున్నారు. బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీ చేసిన ఎక్స్‌పీరియెన్స్ ఉన్న రాహుల్‌ను అంత తక్కువ ధరకు సొంతం చేసుకోవడానికి ఆయనే కారణమని కామెంట్స్ చేస్తున్నారు.


ముందే ఆక్షన్‌లోకి వచ్చుంటే..

ఇప్పుడు రాహుల్‌ను రూ.14 కోట్లకు దక్కించుకున్న డీసీ.. అతడ్ని కెప్టెన్ చేయడం ఖాయం. అప్పట్లో పంత్, అయ్యర్‌ను కూడా ఇలాగే తక్కువ ధరకు కొనుగోలు చేసింది. 2018లో శ్రేయస్‌ను రూ.7 కోట్లకే దక్కించుకొని ఆ తర్వాత సారథ్య బాధ్యతలు అప్పగించింది. 2018లో పంత్‌ను రూ.15 కోట్లకు తీసుకొని కెప్టెన్ చేసింది. ఇప్పుడు కూడా వీళ్లిద్దరూ అమ్ముడుపోయే దాకా ఎదురు చూసి రాహుల్‌ను పక్కా ప్లానింగ్‌తో కొట్టేసిందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఒకవేళ రాహుల్ గనుక ముందు ఆక్షన్‌లోకి వచ్చి ఉంటే పంత్-అయ్యర్‌కు ఇంత ధర వచ్చేది కాదని చెబుతున్నారు. మొత్తంగా ఈ ఇద్దరూ ఢిల్లీ మేనేజ్‌మెంట్‌కు థ్యాంక్స్ చెప్పాలని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read:

షేర్ ఆగయా.. అశ్విన్ కోసం పెద్ద ప్లానింగే.. ఫలించిన సీఎస్‌కే

డేవిడ్ భాయ్ బ్యాడ్ లక్.. విధి ఆడిన వింత నాటకం ఇది

ఐపీఎల్ ఆక్షన్‌లో కేఎల్ రాహుల్‌కు నిరాశ.. మరీ ఇంత దారుణమా?

For More Sports And Telugu News

Updated Date - Nov 24 , 2024 | 08:58 PM