Pant-Iyer: పంత్-అయ్యర్‌కు అంత సీన్ ఉందా? ఫ్రాంచైజీలు పప్పులో కాలేశాయా?
ABN , Publish Date - Nov 24 , 2024 | 07:50 PM
Pant-Iyer: టీమిండియా స్టైలిష్ బ్యాటర్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ పంట పండింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు నిర్వహించిన మెగా ఆక్షన్‌లో ఇద్దరూ రికార్డు ధరకు అమ్ముడుబోయారు.
IPL 2025 Mega Auction: టీమిండియా స్టైలిష్ బ్యాటర్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ పంట పండింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు నిర్వహించిన మెగా ఆక్షన్‌లో ఇద్దరూ రికార్డు ధరకు అమ్ముడుబోయారు. అయ్యర్‌ను రూ.26.75 కోట్ల రికార్డు ధరకు పంజాబ్ కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. అటు రూ.27 కోట్ల ధర చెల్లించి పంత్‌ను దక్కించుకుంది లక్నో సూపర్ జియాంట్స్. ఐపీఎల్ ఆక్షన్ హిస్టరీలో అత్యధిక ధర పలికిన ఆటగాడి పంత్ రికార్డు సృష్టించాడు. అతడి తర్వాత స్థానంలో అయ్యర్ నిలిచాడు. అయితే వీళ్లిద్దరికీ ఇంత ధర పెట్టడం కరెక్టేనా? ఫ్రాంచైజీలు అనవసరంగా కోట్లు కుమ్మరించాయా? అసలు అయ్యర్-పంత్ రేంజ్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
రికార్డులు ఏం చెబుతున్నాయి..
పంత్ కోసం ఐపీఎల్ ఆక్షన్‌లో ఫ్రాంచైజీలన్నీ భారీగా పోటీపడ్డాయి. ఎట్టకేలకు లక్నో సూపర్ జియాంట్స్ అతడ్ని రికార్డు ధరకు కైవసం చేసుకుంది. అయితే టీ20ల్లో పంత్ రికార్డుల చూస్తుంటే అతడికి అంత ధర పెట్టడం సముచితమేనా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని సీజన్లుగా చూసుకుంటే పొట్టి ఫార్మాట్‌లో పంత్ రికార్డులు ఏమంత గొప్పగా లేవు. యాక్సిడెంట్ తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చిన స్టార్ కీపర్ ఈ సీజన్‌లో 13 మ్యాచుల్లో 446 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. 3 హాఫ్ సెంచరీలు బాదాడు. అతడి రేంజ్‌కు ఇది యావరేజ్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలి.
అదే బిగ్ ప్లస్
బ్యాటింగ్ ఆర్డర్‌లో డౌన్‌లో వస్తాడు కాబట్టి పంత్ పెద్దగా స్కోర్లు చేయలేదని వాదించొచ్చు. కానీ టీమ్ కెప్టెన్‌గా ఉన్న రిషబ్ భారీ మరింత బాధ్యతతో బ్యాటింగ్ చేయాల్సింది. భారీ స్కోర్లు బాదుతూ ఇతర ఆటగాళ్లలో తప్పక రాణించాలనే కసి పెంచాల్సింది. కానీ అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గానూ అతడు అంతగా ఆకట్టుకోలేదు. ఇంటర్నేషన్ టీ20ల్లోనూ పంత్‌కు తోపు రికార్డులేమీ లేవు. 76 మ్యాచుల్లో 1209 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 23.25. అయితే అతడి స్ట్రోక్ ప్లే, ప్రస్తుత ఫామ్, ఒంటిచేత్తో మ్యాచ్‌లను మలుపుతిప్పే సత్తా, ప్రొఫెషనల్ లెవల్‌లో ఉన్న ఎక్స్‌పీరియెన్స్, సారథిగా జట్టును నడిపిన అనుభవం, క్రేజ్ ఇంత ధర పలకడానికి ప్రధాన కారణాలుగా అనలిస్టులు చెబుతున్నారు.
అయ్యర్ అంతంతే..
శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి పొట్టి క్రికెట్‌లో అతడి పెర్ఫార్మెన్స్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌లో అయ్యర్ పెద్దగా రాణించడం లేదు. మూడు సీజన్లలో కలిపి 5 హాఫ్ సెంచరీలు మాత్రమే బాదాడు. ఈ సీజన్‌లో అతడి యావరేజ్ 39. అటు ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లోనూ యావరేజ్ 30లోపే ఉంది. అడపాదడపా మెరుపు ఇన్నింగ్స్‌లు తప్పితే బ్యాటింగ్‌లో నిలకడ లేదు. టాపార్డర్‌లో ఆడే బ్యాటర్ ఇలా ఫెయిలైతే టీమ్‌కు కష్టమే. అయితే ఈ ఏడాది కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడం అయ్యర్‌కు బిగ్ ప్లస్ అయింది.
నిలబెట్టుకోవాలి
బ్యాటింగ్ కంటే కూడా కెప్టెన్సీ అయ్యర్‌కు అనుకూలంగా మారింది. అప్పట్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లడం, ఈ ఏడాది కోల్‌కతాను విజేతగా నిలబెట్టడంతో అతడి కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే అయ్యర్ నాయకత్వంతో పాటు ఢిల్లీలో ఉన్నప్పుడు పాంటింగ్, గంగూలీలు.. కేకేఆర్‌లో గంభీర్ లాంటి కోచ్‌లు, మెంటార్‌ల అండతోనే ఆయా జట్లు ట్రోఫీలు నెగ్గాయనే వాదన ఉంది. ఏదేమైనా అటు పంత్, ఇటు అయ్యర్ భారీ ధర పలకడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ ధరకు న్యాయం చేయాలంటే టీమ్స్‌ను గెలిపించాలి. అలాగే బ్యాట్‌తో తాండవం ఆడాలి. అది జరగకపోతే తీవ్ర విమర్శలు తప్పవని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
Also Read:
డేవిడ్ భాయ్ బ్యాడ్ లక్.. విధి ఆడిన వింత నాటకం ఇది
ఐపీఎల్ ఆక్షన్‌లో కేఎల్ రాహుల్‌కు నిరాశ.. మరీ ఇంత దారుణమా?
షమీని ఎగరేసుకుపోయిన సన్‌రైజర్స్.. కావ్య పాప అనుకున్నది
For More Sports And Telugu News