IPL 2024: కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆరంభ మ్యాచ్‌లకు జట్టు కెప్టెన్ దూరం?
ABN , Publish Date - Mar 14 , 2024 | 11:10 AM
మరో వారం రోజుల్లోనే ఐపీఎల్ 2024 ప్రారంభంకానుంది. దీంతో ఫ్రాంచైజీలన్నీ ఈ మెగా లీగ్ కోసం సిద్ధమవుతున్నాయి. ఆటగాళ్లంతా ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. మాజీ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈ సారి ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
మరో వారం రోజుల్లోనే ఐపీఎల్ 2024 (Indian Premier League) ప్రారంభంకానుంది. దీంతో ఫ్రాంచైజీలన్నీ ఈ మెగా లీగ్ కోసం సిద్ధమవుతున్నాయి. ఆటగాళ్లంతా ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. మాజీ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు ఈ సారి ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోసారి శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీలో కేకేఆర్ బరిలోకి దిగనుంది. గతంలో కోల్‌కతాకు కెప్టెన్‌గా రెండు ట్రోఫీలు అందించిన గౌతం గంభీర్ ఈ సారి జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తుండడం గమనార్హం. దీంతో ఈ సారి కోల్‌కతా పాజిటివ్ మైండ్ సెట్‌తో బరిలోకి దిగనుంది. కానీ ఇంతలోనే కోల్‌కతా గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని సమాచారం. పలు నివేదికల ప్రకారం.. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయం మరోసారి తిరగబెట్టింది. దీంతో అతను ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్ చేయకపోవచ్చని తెలుస్తోంది. కాగా వెన్ను నొప్పికి గతేడాది శ్రేయాస్ అయ్యర్ శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు.
‘‘శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయం తీవ్రమైంది. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఐదో రోజు ఆటలో అతను మైదానంలోకి వచ్చే అవకాశం లేదు. అతను ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యే ప్రమాదం ఉంది.’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియా తమ నివేదికలో పేర్కొంది. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పి తిరగబెట్టిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రంజీ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ ముంబై తరఫున బరిలోకి దిగాడు. విదర్భతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగులు మాత్రమే చేసిన శ్రేయాస్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 95 పరుగులతో చెలరేగాడు. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తమ తొలి మ్యాచ్‌ను ఈ నెల 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.