T20 World Cup 2024: రోహిత్ శర్మకు సీనియర్ వార్నింగ్.. కారణమదేనా..?
ABN , Publish Date - Jun 13 , 2024 | 12:01 PM
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు(Indian Cricket Men Team) గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు గెలిచి సూపర్-8కి చేరుకుంది. ఈ టోర్నీలో టీమ్ ప్లేయర్స్ అందరూ అద్భుత ప్రదర్శన చేయడంతో.. ఇప్పటివరకు టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోలేదు. ఇదిలావుండగా, రోహిత్ శర్మ(Rohit Sharma) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ..
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు(Indian Cricket Men Team) గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు గెలిచి సూపర్-8కి చేరుకుంది. ఈ టోర్నీలో టీమ్ ప్లేయర్స్ అందరూ అద్భుత ప్రదర్శన చేయడంతో.. ఇప్పటివరకు టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోలేదు. ఇదిలావుండగా, రోహిత్ శర్మ(Rohit Sharma) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం రాబోయే మ్యాచ్‌లలో టీమిండియాకు నష్టం కలిగించే అవకాశం ఉందని సీనియర్స్ భావిస్తున్నారు. టీ20లో టీమిండియా ఓపెనర్స్‌గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క్రీజ్‌లోకి వస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా మాట్లాడిన రోహిత్ శర్మ.. జట్టులో ఓపెనింగ్ జోడీ ఫిక్స్‌గా ఉందని.. భవిష్యత్‌లో కూడా విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ఓపెనర్స్‌గా దిగుతామని రోహిత్ శర్మ చెప్పాడు. ఈ కామెంట్ ఇప్పుడు హాట్ డిస్కషన్‌గా మారింది. రోహిత్ నిర్ణయంపై భారత మాజీ క్రికెట్ మహ్మద్ కైఫ్ స్పందించాడు. రోహిత్‌కు ఓ సలహా ఇచ్చాడు.
ఓపెనర్‌గా అతను బెటర్..
విరాట్ కోహ్లీ తొలిసారిగా టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ జట్టు ఓపెనర్‌గా దిగుతున్నాడు. అయితే, ఇప్పటి వరకు ఈ స్థానంలో ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే ఇప్పుడు ఇండియా క్రికెట్ టీమ్‌ను, భారత క్రికెట్ అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. టోర్నీలోని మూడు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ చాలా త్వరగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో మిడిల్ ఓవర్‌లో పరుగులు రాబట్టడంలో టీమిండియా విఫలమవుతోంది. ఈ నేపథ్యంలోనే స్పందించిన కైఫ్.. రాబోయే మ్యాచ్‌లో రిషబ్ పంత్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలని కెప్టెన్ రోహిత్ శర్మకు సూచించాడు. విరాట్ కోహ్లీని 3వ స్థానంలో దించాలని సూచించాడు.
కైఫ్ అంచనా ప్రకారం.. అమెరికాలోని క్రికెట్ స్టేడియం పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంది. వెస్టిండీస్‌లో టీమిండియా స్లో పిచ్‌పై ఆడాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఓపెనర్స్ ఔట్ అయినా.. ఆ తరువాత ఇన్నింగ్స్ రాణించగల బ్యాట్స్‌మెన్ అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు జట్టులోని ఇతర బ్యాట్స్‌మెన్ ఆ పని చేయడంలో విఫలమయ్యారు. అటాకింగ్ ఫార్మాట్‌లో కాకుండా.. వికెట్లు కాపాడుకుంటూ ఆడాలని టీమిండియాకు కైఫ్ సూచించాడు. అందుకే విరాట్‌ను 3వ స్థానంలో దింపడమే సరైందని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియాను ఢీకొట్టనున్న టీమిండియా..
టీ20లో భారత జట్టు సూపర్-8కి చేరుకుంది. సూపర్-8లో రెండు గ్రూపులు ఉండగా.. అందులో టీమ్ ఇండియా గ్రూప్-1లో ఉంది. ఆస్ట్రేలియా కూడా ఈ గ్రూప్‌కు అర్హత సాధించింది. ఈ గ్రూప్‌లో మరో రెండు జట్లు ఖరారు కానప్పటికీ.. భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరు మాత్రం ఖాయమైంది. జూన్ 24వ తేదీన సోమవారం సెయింట్ లూసియాలోని డారెన్ స్యామీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియాపై ఇక్కడ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంటుంది.