Voter Enrollment: చేతిలో ఫోన్ ఉందిగా.. ఓటరుగా నమోదు చేసుకోండి.. చాలా ఈజీ..!!
ABN , Publish Date - Apr 12 , 2024 | 07:19 PM
2006 మార్చి 31వ తేదీ లోపు జన్మించిన వారికి కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు మరో మూడు రోజులే గడువు ఉంది. ఈ నెల 15వ తేదీ లోపు ఓటరుగా నమోదు చేసుకొని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని భారత ఎన్నికల సంఘం కోరుతుంది.
హైదరాబాద్: మీకు 18 ఏళ్లు వచ్చాయా..? ఇప్పటి వరకు ఓటు (Vote) కోసం దరఖాస్తు చేసుకోలేదా..? మీకు స్మార్ట్ ఫోన్ ఉందా..? ఎందుకు ఆలస్యం వెంటనే ఈ లింక్ ఓపెన్ చేయండి. ఓటరుగా మీ పేరును నమోదు చేసుకండి. 2006 మార్చి 31వ తేదీ లోపు జన్మించిన వారికి కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు మరో మూడు రోజులే గడువు ఉంది. ఈ నెల 15వ తేదీ లోపు ఓటరుగా నమోదు చేసుకొని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని భారత ఎన్నికల సంఘం కోరుతుంది.
Mynampally Hanumathrao: నా టార్గెట్ గజ్వేల్, సిద్దిపేటలో ఇద్దరినీ ఇంటికి పంపుడే...
గల్లంతయిన వారు కూడా
ఓటరు జాబితాలో పేరు గల్లంతయిన వారు, ఇప్పటికీ ఓటు రాని వారు కూడా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎడమవైపు పైన న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్షన్స్ అని కనిపిస్తోంది. ఫామ్ 6 ఓపెన్ చేస్తే మొబైల్ నంబర్, పాస్ వర్డ్ వస్తోంది. క్యాప్చ ఎంటర్ చేసి.. ఓటీపీ కోసం రిక్వెస్ట్ చేయాలి. ఓటీపీ వచ్చిన తర్వాత ఫారం-6 పూర్తి చేయాలి. ఇందుకోసం పాస్ పోర్టు సైజ్ ఫొటో, అడ్రస్, పుట్టిన తేదీని ధృవికరించే పత్రాలు ఉండాల్సి ఉంటుంది. ఆ వివరాలు అప్ లోడ్ చేస్తే సరిపోతుంది. వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని సబ్ మిట్ చేయాలి. దాంతో అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
Ponnam Prabhakar: ఈనెల 14న మంత్రి పొన్నం దీక్ష.. ఎందుకోసమంటే?
మార్పులు చేసుకోవచ్చు
ఓటరు జాబితాలో పేరు ఉండి, నివసించే ప్రాంతం మార్చుకోవడానికి, కుటుంబ సభ్యులను ఒకే పోలింగ్ కేంద్రంలో లేకుంటే మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 15వ తేదీ సోమవారం వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అర్హులైన వారి వివరాలతో ఓటర్ల అనుబంధ జాబితాను ఏప్రిల్ 25వ తేదీన ఎన్నికల సంఘం ప్రకటించనుంది. దాంతో మే 13వ తేదీన తెలంగాణలో లోక్ సభ, ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది.
Delhi liquor Case: మూడు రోజుల సీబీఐ కస్టడీకి కవిత.. ఢిల్లీ కోర్టు ఆదేశం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం