Share News

Aadi Srinivas: ఫిరాయింపులపై కేటీఆర్‌ మొసలి కన్నీరు..

ABN , Publish Date - Jun 27 , 2024 | 05:06 AM

పార్టీ ఫిరాయింపులపైన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆరోపించారు. గతంలో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకుని మంత్రిని చేసినప్పుడు కేసీఆర్‌ను ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు.

Aadi Srinivas: ఫిరాయింపులపై కేటీఆర్‌ మొసలి కన్నీరు..

  • త్వరలోనే బీఆర్‌ఎస్‌ నుంచి మరిన్ని చేరికలు: విప్‌ ఆది శ్రీనివాస్‌

హైదరాబాద్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపులపైన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆరోపించారు. గతంలో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకుని మంత్రిని చేసినప్పుడు కేసీఆర్‌ను ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. 2019లో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ఎటు పోయిందో కేటీఆర్‌ చెప్పాలన్నారు. సీఎల్పీ మీడియా హాల్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరుతున్నారన్నారు.


బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కేసీఆర్‌.. తన ఫామ్‌ హౌస్‌లో వీడ్కోలు పార్టీ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ మునుగుతున్న నావ అని, రేవంత్‌రెడ్డి అనే తుఫానులో ఆ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను హీనాతి హీనంగా చూసిన చరిత్ర కేసీఆర్‌ది అని ధ్వజమెత్తారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలోకి మరిన్ని చేరికలుంటాయని స్పష్టం చేశారు. ఆ పార్టీలో మిగిలేది నలుగురేనన్నారు. కాగా, దివ్యాంగులకు ఉన్నత విద్యలో 5శాతం రిజర్వేషన్‌ కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డి.. వారి ఆత్మబంధువుగా మారారని టీపీసీసీ దివ్యాంగుల సెల్‌ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య కొనియాడారు.

Updated Date - Jun 27 , 2024 | 05:06 AM