Kadem Project: కడెం ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులు ఎప్పటికి పూర్తయ్యేనో?
ABN , Publish Date - Jul 02 , 2024 | 10:08 AM
Telangana: రోజులు గడుస్తున్నప్పటికీ కడెం ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులు మాత్రం ఇంకా పూర్తి కాని పరిస్థితి. దీంతో ఇప్పటికీ ప్రాజెక్ట్‌లోని నీరు వృధాగా పోతోంది. మరోవైపు తాజాగా కురుస్తున్న వర్షాలకు ఎగవ నుంచి ఇన్‌ఫ్లో ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతోంది. అయితే మరమ్మతులు పూర్తి కాకపోవడంతో 1, 2, 3 గేట్ల నుంచి నీరు వృధాగా పోతోంది.
నిర్మల్, జూలై 2: రోజులు గడుస్తున్నప్పటికీ కడెం ప్రాజెక్ట్ (Kadem Project) మరమ్మత్తు పనులు మాత్రం ఇంకా పూర్తి కాని పరిస్థితి. దీంతో ఇప్పటికీ ప్రాజెక్ట్‌లోని నీరు వృధాగా పోతోంది. మరోవైపు తాజాగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతోంది. అయితే మరమ్మతులు పూర్తి కాకపోవడంతో 1, 2, 3 గేట్ల నుంచి నీరు వృధాగా పోతోంది. పనులు త్వరగా పూర్తి చేసి నీటిని నిల్వ చేయాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
TDP Office: చేసిందెవరు.. చేయించిందెవరు!?
కాగా... ఉమ్మడి ఆదిలాబాద్ లోని మూడు నియోజకవర్గాలలో సుమారు 70వేల ఎకరాలకు నీటినందించిన కడెం ప్రాజెక్ట్... 2022లో వచ్చిన వరదలతో డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. భారీగా వర్షాలకు ప్రాజెక్ట్ పూర్తిగా నిండిపోయి.. సరిగ్గా గేట్లు తెరుచుకోకపోవడంతో ప్రాజెక్ట్ పై నుంచి నీరు పారింది. ఒకానొక క్రమంలో ప్రాజెక్ట్ కొట్టుకుపోతుందేమో అని అంతా భావించారు. దీంతో దిగువన ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు కూడా.
AP Pensions: పెన్షన్ల పంపిణీలో చేతివాటం.. రూ. 200 కోత
చివరకు నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో పరిస్థితి కాస్త సర్దుమణిగింది. అయితే ప్రాజెక్ట్ మరమ్మత్తుల కోసం గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అనంతరం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈఏడాది జనవరిలో ప్రాజెక్ట్ మరమ్మత్తుల కోసం రూ.5.46 కోట్లు మంజూరు చేసింది. అయితే మరోసారి వర్షాకాలం రావడం... పనులు ఇంకా కొనసాగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పనులు పూర్తవుతాయా? లేదా? అనే సందిగ్ధంలో అన్నదాతలు ఉన్నారు. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి....
KCR: కేసీఆర్‌కు మరో చాన్స్ ఇద్దామా!
Chandrababu : పేదింటికి పండగొచ్చింది
Read Latest Telangana News AND Telugu News