Share News

Hyderabad: జీహెచ్‌ఎంసీలో వింత పరిస్థితి.. అధికారుల మధ్య సమన్వయలోపం

ABN , Publish Date - Jul 02 , 2024 | 09:31 AM

జీహెచ్‌ఎంసీ(GHMC)లో ఐఏఎస్‌, నాన్‌ ఐఏఎస్‌ వార్‌ నడుస్తోంది. సమన్వయంతో పని చేయాల్సిన పలువురు అదనపు కమిషనర్లు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శానిటేషన్‌, ఐటీ విభాగాల మధ్య సమన్వయ లేమి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన హాజరు విధానం అమలుపై ప్రభావం చూపుతోంది.

Hyderabad: జీహెచ్‌ఎంసీలో వింత పరిస్థితి.. అధికారుల మధ్య సమన్వయలోపం

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ(GHMC)లో ఐఏఎస్‌, నాన్‌ ఐఏఎస్‌ వార్‌ నడుస్తోంది. సమన్వయంతో పని చేయాల్సిన పలువురు అదనపు కమిషనర్లు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శానిటేషన్‌, ఐటీ విభాగాల మధ్య సమన్వయ లేమి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన హాజరు విధానం అమలుపై ప్రభావం చూపుతోంది. ట్యాంపరింగ్‌కు అవకాశం లేదని ఐటీ విభాగం అందుబాటులోకి తీసుకువచ్చిన ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌లో లోపాలు ఇటీవల బయటపడ్డాయి. వీటిని ఇప్పటికే సరి చేసినట్టు ఉన్నతాధికారులు ప్రకటించారు. ట్యాంపరింగ్‌(Tampering)కు పాల్పడిన వారిపై చర్యల విషయంలో మాత్రం ఇంకా అడుగు ముందుకు పడలేదు. ఫొటోలు, వీడియోలతో కార్మికుల హాజరు వేసేందుకు ప్రయత్నించిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జోనల్‌ కమిషనర్లకు సూచించినట్టు ఐటీ విభాగం వర్గాలు చెబుతున్నాయి.

ఇదికూడా చదవండి: BRS: అనుమతుల్లేకుండా నల్లగొండ బీఆర్‌ఎస్‌ కార్యాలయం!


పలువురు జోనల్‌ కమిషర్లు మాత్రం.. అదేం లేదు.. ఎవరిపై ఇంకా చర్యలు తీసుకోలేదని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇదిలా ఉంటే.. ఏదైనా విభాగంలో అవకతవకలు జరిగితే.. అక్రమాలకు పాల్పడిన వారి వివరాలను సంబంధిత విభాగాధిపతికి పంపాలి. కానీ ఇక్కడ పారిశుధ్య నిర్వహణ విభాగానికి వివరాలు ఇవ్వకుండా.. ఐటీ విభాగం నేరుగా జోనల్‌ కమిషనర్లకు సూచనలు చేయడం చర్చనీయాంశమైంది. ‘యాప్‌ హాజరులో ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారి వివరాలు మాకు ఇంకా అందలేదు. గుర్తించిన వారి వివరాలూ తెలియదు’ అని శానిటేషన్‌ అదనపు కమిషనర్‌ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 09:31 AM