Share News

Jaggareddy: బీజేపీ నాయకులే సిగ్గుతో తల దించుకోవాలి

ABN , Publish Date - Apr 30 , 2024 | 03:33 PM

Telangana: పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ స్పీచ్‌లు చూసి బీజేపీ నాయకుల్లో దడ మొదలైందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవరం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకం కాదని బాఘవత్ ప్రెస్ రిలీజ్‌కి కారణం రాహుల్ గాంధీ స్పీచ్ అని చెప్పుకొచ్చారు. ఢిల్లీ పోలీసు గాంధీ భవన్ నోటీసులు తీసుకురావటం కూడా దీనిలో భాగమే అని మండిపడ్డారు.

Jaggareddy: బీజేపీ నాయకులే సిగ్గుతో తల దించుకోవాలి
Congress Working President Jaggareddy

హైదరాబాద్, ఏప్రిల్ 30: పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పీచ్‌లు చూసి బీజేపీ (BJP)నాయకుల్లో దడ మొదలైందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Congress Working President Jaggareddy) అన్నారు. మంగళవరం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకం కాదని బాఘవత్ ప్రెస్ రిలీజ్‌కి కారణం రాహుల్ గాంధీ స్పీచ్ అని చెప్పుకొచ్చారు. గాంధీ భవన్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు తీసుకురావటం కూడా దీనిలో భాగమే అని మండిపడ్డారు. బీసీలు, ఎస్సీ ఎస్టీలు దీన్ని గమనించాలన్నారు. మోదీ (PM Modi) పదేళ్లు ప్రధానిగా ఉండి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారని వ్యాఖ్యలు చేశారు.

AP Elections 2024: కూటమి మేనిఫెస్టో వచ్చేసిందహో.. అదిరిపోయిందిగా..!!


ప్రజలు దృష్టిని ఆకర్షించడంలో భాగంగా అమిత్ షా గీసిన స్కెచ్ ఏ ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్‌కు రావడం అంటూ విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి హోదాలో పుస్తేల మీద దిగజారుడు రాజకీయాలకు బీజేపీ నాయకులే సిగ్గుతో తల దించుకోవాలన్నారు. ఆస్తులపై, పుస్తెలపై ఒక్క ఫిర్యాదు హిందువులు ఇచ్చినా తాము ముక్కు నేలకు రాస్తామన్నారని.. ఇన్ని అబద్దాల ప్రచారం చెయ్యమని మోదీకి నేర్పిస్తున్న వాళ్ళు ఎవరని ప్రశ్నించారు. ఎన్నిక కమిషన్ రాజస్థాన్‌లో మోదీ ప్రసంగం మీద ఎందుకు నోటీస్ ఇవ్వలేదని నిలదీశారు. ఎన్నికల కమీషన్ డమ్మీగా మారిందని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: బంపర్ ఆఫర్.. కూపన్ నింపితే లక్ష మీదే..

Lok Sabha Elections: 400 సీట్ల లక్ష్యం సాధిస్తాం: రాజ్‌నాథ్ సింగ్

Read Latest Telangana News And Telugu News

10th ఫలితాల కోసం క్లిక్ చేయండి...

Updated Date - Apr 30 , 2024 | 03:33 PM