Share News

Maoists: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌!

ABN , Publish Date - Jul 20 , 2024 | 05:42 AM

తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దులో శుక్రవారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్‌ పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా ఓ మావోయిస్టు మృతిచెందినట్టు ములుగు ఎస్పీ శబరీశ్‌ వెల్లడించారు.

Maoists: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌!

  • మావోయిస్టు మృతి

ములుగు, చర్ల, జూలై 19: తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దులో శుక్రవారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్‌ పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా ఓ మావోయిస్టు మృతిచెందినట్టు ములుగు ఎస్పీ శబరీశ్‌ వెల్లడించారు. ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా ఎల్మిడి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని సీమలదొడ్డి అటవీ ప్రాంతం ఉరవసారి గుట్ట సమీపంలో శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న పోలీసులకు సుమారు 20మంది సభ్యులున్న మావోయిస్టు దళం ఎదురైంది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య 15 నిమిషాలపాటు ఎదురుకాల్పులు జరిగాయి.


అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించగా పోలీసులకు ఓ మావోయిస్టు సభ్యుడి మృతదేహం, సమీపంలో 9ఎంఎం కార్బన్‌ తుపాకీ, తూటాలు, డిటోనెటర్‌, మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యం, కిట్‌బ్యాగు, నిత్యావసర వస్తువులు లభ్యమయ్యాయి. ఛత్తీ్‌సగఢ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చి మృతదేహంతోపాటు లభ్యమైన సామగ్రిని స్వాధీనపర్చారు. కాగా కొద్దిరోజులుగా ములుగు ఏజెన్సీలో పోలీసు చర్యలు నివురుగప్పిన నిప్పులా మారాయి. అటవీ గ్రామాలు, గొత్తికోయ గూడాలలో పోలీసులు తనిఖీలు జరుపుతున్నారు. మావోయిస్టు పార్టీ మోస్ట్‌వాంటెడ్‌ నాయకులు ఛత్తీ్‌సగఢ్‌ అడవులను వదిలి తెలంగాణ సరిహద్దు గ్రామాలకు వచ్చారని, రిక్రూట్‌మెంట్లను ప్రోత్సహిస్తున్నారనే నిఘావర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Updated Date - Jul 20 , 2024 | 05:42 AM