Lok Sabha Elections 2024: ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న కాంగ్రెస్: ఎర్రోళ్ల శ్రీనివాస్
ABN , Publish Date - Apr 30 , 2024 | 04:01 PM
100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ఠను కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం దెబ్బతీస్తోందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) అన్నారు. కరెంటు, నీళ్లు ఇవ్వలేమని విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టళ్లను ఖాళీ చేయాలని ప్రభుత్వం విద్యార్థులకు నోటీసులు ఇచ్చిందన్నారు. విద్యార్థులకు నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
హైదరాబాద్: 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ఠను కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం దెబ్బతీస్తోందని బీఆర్ఎస్ (BRS) నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) అన్నారు. కరెంటు, నీళ్లు ఇవ్వలేమని విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టళ్లను ఖాళీ చేయాలని ప్రభుత్వం విద్యార్థులకు నోటీసులు ఇచ్చిందన్నారు. విద్యార్థులకు నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
Loksabha polls 2024: కరెంట్ పోయిందంటూ అబద్దాలు చెబుతున్నారు.. కేసీఆర్‌పై తుమ్మల ఆగ్రహం
మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వీసీ పర్మిషన్ లేకుండా చీఫ్ వార్డెన్‌కు నోటీసులు ఎలా ఇస్తారన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించిన తర్వాత చీఫ్ వార్డెన్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారని గుర్తుచేశారు.చిన్న అధికారిని బలి చేసి చేతులు దులుపుకునేలా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పై స్థాయి అధికారులకు తెలియకుండా చీఫ్ వార్డెన్‌కు సంబంధిత సర్క్యూలర్ జారీ చేసే అధికారం ఉండదని చెప్పారు. ఈ విషయంలో షోకాజ్ నోటీసులు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో 4వ సెమిస్టర్ పరీక్షలు ఉంటే సెలవులు ఇస్తామని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.
యూనివర్సిటీలో చదివే విద్యార్థులు అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారేనని చెప్పారు. యూనివర్సిటీ నుంచి విద్యార్థులను వెల్లగొట్టే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వ చేతగానితనానికి ఎస్సీ అధికారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో యూనివర్సిటీ విద్యార్థులు అంతా ఏకం కావాలని.. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
Loksabha polls 2024: కేసీఆర్.. స్థాయిని మరిచి అబద్దాలు మాట్లాడుతున్నారన్న భట్టి
Madhukar Reddy: కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు..
Read Latest Telangana News And Telugu News