Harish Rao: దేవుళ్ల మీద ఒట్టు పెడుతూ కొత్త డ్రామాకు తెర.. | Former Minister Harish Rao criticize CM Revanth Reddy Hyderabad Telangana Suchi
Share News

Harish Rao: దేవుళ్ల మీద ఒట్టు పెడుతూ కొత్త డ్రామాకు తెర..

ABN , Publish Date - May 04 , 2024 | 01:01 PM

Telangana: ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో మార్పు మొదలైంది. రేవంత్ పాలనలో పంట పెట్టుబడి సహాయం అందలేదు మార్పు మొదలైంది. అనేక పట్టణాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. విద్యుత్ సరఫరాలో కోతతో మార్పు మొదలైంది. పంటలు ఎండటంలో మార్పు. అక్రమ కేసులు పెట్టడంలో, జైళ్లు నింపడంలో మార్పు మొదలైంది’’ అంటూ మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు.

Harish Rao: దేవుళ్ల మీద ఒట్టు పెడుతూ కొత్త డ్రామాకు తెర..
Former Minister Harish Rao - CM Revanth Reddy

హైదరాబాద్, మే 4: ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో (Loksabha Elections 2024) మార్పు మొదలైంది. రేవంత్ (CM Revanth Reddy) పాలనలో పంట పెట్టుబడి సహాయం అందలేదు మార్పు మొదలైంది. అనేక పట్టణాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. విద్యుత్ సరఫరాలో కోతతో మార్పు మొదలైంది. పంటలు ఎండటంలో మార్పు. అక్రమ కేసులు పెట్టడంలో, జైళ్లు నింపడంలో మార్పు మొదలైంది’’ అంటూ మాజీ మంత్రి హరీష్‌ రావు (Former Minister Harish Rao) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు నిజంగా మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.

AP Elections: తాడేపల్లి 'కొంప' ముంచిందా.. భయంతో బతుకుతున్న జగన్..!

ABN ఛానల్ ఫాలో అవ్వండి

వంద రోజుల్లో ఆరు గారెంటీలు అమలు చేస్తాం అని బాండ్ పేపర్ రాసిచ్చారని.. కాంగ్రెస్ (Congress) రాసిచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందని వ్యాఖ్యలు చేశారు. బౌన్స్ అయిన బాండ్ పేపర్ రాసిచ్చిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దేవుళ్ల మీద ఒట్టు పెడుతూ కొత్త డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి దుర్మార్గపు భాష మాట్లాడుతున్నారన్నారు. ఢిల్లీకి మూటలు పంపడంపై ఉన్న శ్రద్ధ ఆరు గ్యారంటీల అమలుపై లేదన్నారు. రేవంత్ భాషను ప్రజలు అసహించుకుంటున్నారని తెలిపారు.

AP Pension: పెన్షన్‌ కోసం వెళ్లి వడదెబ్బ తగిలి పిట్టల్లారాలుతున్న వృద్ధులు


మీ ప్రజా పాలన అట్టర్ ప్లాప్..

గుడ్డి వ్యతిరేకతతో కొత్త జిల్లాలు తీసేస్తం అంటున్నారని.. జిల్లాలు తీసేస్తే ప్రజలు ఊరుకుంటారా?.. జిల్లా తీసేస్తారు? అని ప్రశ్నలు కురిపించారు. ప్రగతి భవన్ ముందు ముళ్ల కంచెలు పెట్టిందే కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. ‘‘కంచెలు బద్దలు కొట్టి ఎక్కడకు వెళ్ళినవ్. అక్కడికి ఎందుకు వెళ్లడం లేదు. మీ ప్రజా పాలన అట్టర్ ప్లాప్.. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని అన్నారు. ప్రవచనాలు చెప్పిన రేవంత్ రెడ్డి ఎడా పెడా కండువాలు కప్పుతున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. పాత మేనిఫెస్టోనే అమలు చేయలేదని, కొత్త మేనిఫెస్టోను ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. 8 స్థానాల్లో బీజేపీ, 8 స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకునేలా చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. రేవంత్‌కు మూలాలు ఆంధ్రాలో ఉన్నాయని.. రేవంత్ వారికి సహకరించే ప్రమాదం ఉందని తెలిపారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని మాజీ మంత్రి పేర్కొన్నారు.

Lok Sabha Polls: రాహుల్ వారసత్వాన్ని నిలబెట్టుకుంటారా..!


కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలి?

కొత్త పథకాలు ఇవ్వలేదు కానీ, ఉన్న పథకాలే అమలు కావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలు అయ్యాయని ప్రశ్నించారు. ఆరులో ఐదు అమలు అయ్యాయి అనేది అబద్దమన్నారు. అన్నింటిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని, అన్ని వర్గాలను మోసం చేశారని అన్నారు. మరి కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలని అడిగారు.. వృద్దులకు ఒక నెల పెన్షన్ కూడా ఎగొట్టారంటూ హరీష్‌ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

Lok Sabha Polls: క్షీణించిన తేజస్వి యాదవ్‌ ఆరోగ్యం.. ఎన్నికలపై ప్రభావం చూపుతుందా..!

Phone Tapping Case: ప్రధాన నిందితుడు ప్రభాకర్‌ రావే... తేల్చేసిన పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 04 , 2024 | 01:14 PM