Student Discipline: డ్రగ్స్ దొరికితే అడ్మిషన్ రద్దు!
ABN , Publish Date - Aug 16 , 2024 | 02:53 AM
సీతారామ ప్రాజెక్టును మానసపుత్రికగా చెప్పుకొంటున్న కేటీఆర్, హరీశ్‌రావులు దశాబ్ద కాలంలో చుక్క నీరు కూడా అందించలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విమర్శించారు.
వర్సిటీలు, కాలేజీల్లోనియంత్రణపై సర్కారు దృష్టి
రేపు కీలక సమావేశం
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో డ్రగ్స్‌తో పట్టుబడే విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేయాలని భావిస్తోంది. ఈ అంశంపై మరింత లోతుగా చర్చించేందుకు డీజీపీ జితేందర్, విద్యాశాఖ అధికారులు, వర్సిటీల ఇన్‌చార్జి వీసీలు, యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో అధికారులు శనివారం భేటీ కానున్నారు. వర్సిటీలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో డ్రగ్స్, ర్యాగింగ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఇప్పుడు ఉన్న చట్టాల ప్రకారం డ్రగ్స్, ర్యాగింగ్‌లను పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చా? మరిన్ని కఠినమైన నిబంధనలను తీసుకురావాలా? అనే అంశంపై మేథోమదనం చేయనున్నారు. ప్రస్తుత చట్టాలు, నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి వద్ద డ్రగ్స్ లభిస్తే.. కౌన్సెలింగ్ ఇచ్చి, వదిలి వేయాలి. అయితే.. దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, అడ్మిషన్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటే.. విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లేందుకు సాహసించరని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.