Harish Rao: గురుకుల అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలి..
ABN , Publish Date - Jun 27 , 2024 | 05:38 AM
రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
సర్కార్‌కు వారి బాధలు కనిపించట్లేదా?: హరీశ్‌రావు
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. సీఎం ఇంటి ముందు మోకాళ్ల మీద నిలబడి అభ్యర్థించినా గురుకుల అభ్యర్థుల మొర అలకించకపోవడం శోచనీయమన్నారు. బుధవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా గురుకుల అభ్యర్థుల నిరసనకు మద్దతు ప్రకటించారు.
వారి సమస్యలను తక్షణం పరిష్కరించాలని బీఆర్‌ఎస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోస్టులు బ్యాక్‌లాగ్ కాకుండా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అన్నింటినీ భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు జీవో46ను సవరించాలని బీఆర్‌ఎస్ నేత రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. జీవో46కు సంబధించిన కేసు విచారణను అడ్వకేట్ జనరల్ ఉద్దేశపూర్వకంగా వాయిదా వేయించారని ఆరోపించారు.