Share News

BRS: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్... కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..

ABN , Publish Date - Nov 24 , 2024 | 11:40 AM

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో దళితబంధు రెండో విడత నిధులను విడుదల చేయాలని దళితులు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. దళిత బంధు రెండో విడత డబ్బులు రాని వారు తమ ఇంటికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

BRS: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్... కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..

కరీంనగర్: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఇవాళ(ఆదివారం) పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన దళితబంధు లబ్ధిదారులతో హుజూరాబాద్‌లో అనుమతి లేకుండా ధర్నా చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కౌశిక్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 35(3) BNS యాక్ట్‌ కింద హుజూరాబాద్‌లో కేసు నమోదు చేసినట్లు నోటీసులో పోలీసులు పేర్కొన్నారు.


Padi-Kaushik-Reddy.jpg

దళితబంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని ధర్నా..

కాగా.. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో దళితబంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని దళితులు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. దళిత బంధు రెండో విడత డబ్బులు రాని వారు తమ ఇంటికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో లబ్ధిదారులు ఎమ్మెల్యే ఇంటికి పెద్దఎత్తున తరలివచ్చారు. హుజూరాబాద్‌ అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద తాము చేపట్టిన ధర్నాలో పాల్గొనాలని లబ్ధిదారులు కౌశిక్‌రెడ్డిని కోరారు. దీంతో అందరూ కలిసి ర్యాలీగా చౌరస్తాకు చేరుకుని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.


అరెకపూడి గాంధీతో వాగ్వాదం..

అలాగే... గతంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో సవాళ్లు, ప్రతిసవాళ్లకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు ఝలక్ ఇచ్చారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవి చందన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేవారు. 132, 351 (3) బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు నమోదు చేశారు.


పోలీసులు ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు యత్నించగా లబ్ధిదారులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యేను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కౌశిక్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కౌశిక్‌రెడ్డిని విడుదల చేయాలని దళితబంధు లబ్ధిదారులు గంట పాటు రాస్తారోకో చేశారు. దీంతో కరీంనగర్‌-హనుమకొండ ప్రధాన రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దళితబంధు రెండో విడత నిధులు లబ్ధిదారులకు ఇచ్చేదాకా పోరాటం చేస్తామని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అన్నారు.


శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గాంధీ ఇంటికెళ్లి బీఆర్‌ఎస్‌ జెండా ఎగరేస్తానని కౌశిక్‌ శపథం చేశారు. అయితే ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే అనూహ్య రీతిలో పాడి కౌశిక్ రెడ్డి విల్లాకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తన అనుచరులను వెంటబెట్టుకొని వెళ్లడం రచ్చకు దారితీసింది. టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. కిటికీలు, కుండీలు ధ్వంసం చేశారు. ప్రతిగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీంతో దాదాపు గంటన్నరపాటు అక్కడ హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. గాంధీని పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. ఆ తర్వాత సైబరాబాద్‌ కమిషనరేట్‌కు హరీశ్‌, కౌశిక్‌‌లను తరలించారు.

Updated Date - Nov 24 , 2024 | 04:01 PM