Adluri Laxman: ఫిరాయింపులపై హరీష్‌రావు చెప్పేవి సుద్దపూస కబుర్లు.. అడ్లూరి లక్ష్మణ్ వ్యంగ్యాస్త్రాలు
ABN , Publish Date - Sep 09 , 2024 | 07:37 PM
పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీష్‌రావు సుద్దపూస కబుర్లు చెబుతున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపణలు చేశారు. తెలంగాణలో పదేళ్ల పాటు ప్రజాస్వామ్యాన్ని చెరపట్టి ఇప్పుడు నీతులు బోధిస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీష్‌రావు సుద్దపూస కబుర్లు చెబుతున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) ఆరోపణలు చేశారు. తెలంగాణలో పదేళ్ల పాటు ప్రజాస్వామ్యాన్ని చెరపట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు నీతులు బోధిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన మామా అల్లుళ్లు ఇప్పుడు వేమన శతకాలు వల్లెవేస్తున్నారని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు.
ALSO READ: CM Revanth Reddy: ఐఐహెచ్‌టీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు
ఇప్పుడు రాజ్యాంగం గుర్తుకొచ్చిందా..?
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా బేరసారాలు చేసిన హరీష్‌రావుకు ఇప్పుడు రాజ్యాంగం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. విపక్ష శాసనసభ్యుల ఇళ్లకు వెళ్లి ప్రలోభాలు పెట్టి, బెదిరించి చేర్చుకున్న రోజులను హరీష్‌రావు మర్చిపోయినట్లున్నారని మండిపడ్డారు. రాజ్ భవన్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు రాజ్యాంగ స్పూర్తి ఎటు పోయిందని హరీష్‌రావును ప్రశ్నించారు. ‘అప్రజాస్వామ్యం అంటు ఇప్పుడు గగ్గోలు పెడుతున్న హరీష్‌రావు... మీ మామ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంటే ఏం చేశావు’’ అని అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు.
అక్రమ కేసులు పెట్టి వేధించారు...
‘‘తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల గొంతులు పిసుకుతుంటే చప్పట్లు కొట్టింది నువ్వు కాదా...? ప్రజాసంఘాలను కేసీఆర్ ఖతం చేస్తుంటే పక్కనుంచి నువ్వు చేసిన భజన ఎవరికి తెలియదనుకుంటున్నవా..? అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంటే వెకిలి నవ్వులు నవ్వింది నువ్వు కాదా హరీష్ రావు....? సిగ్గు , లజ్జా లేకుండా పార్టీ ఫిరాయింపుల గురించి, కోర్టు తీర్పుల గురించి మాట్లాడుతావా... నీకు ఆత్మసాక్షి ఉందా..? వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లు హరీష్‌రావు, బీఆర్ఎస్ నేతల తీరు ఉంది’’ అని అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు.
ALSO READ:TG News: 4కోట్ల మోసాలకు పాల్పడిన రాజస్థాన్ ముఠా అరెస్ట్
బీఆర్ఎస్కు మరోసారి కర్రు కాల్చి వాత పెడతారు...
‘‘ఉప ఎన్నికలు వస్తాయని హరీష్‌రావు ఆనందపడుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా నీకు, నీ మామకు సిగ్గు రాలేదా..? మళ్లీ నీకు ఉప ఎన్నికలు కావాలా....? తెలంగాణ ప్రజలు మరోసారి కర్రు కాల్చి వాత పెడతరు జాగ్రత్త. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కే జనం జేజేలు కొడతారు. పార్టీ ఫిరాయింపులపైన తెలంగాణ హైకోర్టు తీర్పును గౌరవిస్తాం. మా స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు’’ అని మాజీ మంత్రి హరీష్‌రావుకు అడ్లూరి లక్ష్మణ్ వార్నిగ్ ఇచ్చారు .
ఈ వార్తలు కూడా చదవండి...
TG News: నిన్న అదృశ్యమైన బాలుడు.. నీటి గుంటలో పడి మృతి
Mahesh kumar: ప్రతీ హామీ అమలు చేసి తీరతాం
Hyderabad: పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు..
Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి కేసులో సీబీఐకి సుప్రీంకోర్ట్ కీలక ఆదేశాలు
BRS MLA'S: హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హర్షం
Read LatestTelangana News And Telugu News