Adnaki Dayakar: కేసీఆర్ పగటి కలలు కంటున్నారు.. అద్దంకి దయాకర్ విసుర్లు
ABN , Publish Date - Nov 10 , 2024 | 12:58 PM
వ్యవస్థలకు పునర్జీవం పోయడమే కాంగ్రెస్ లక్ష్యమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తెలిపారు. హైదరాబాద్‌ను పునర్నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ స్పందించారు. నాలుగు నెలల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి వచ్చేది తమ ప్రభుత్వమేనని పగటి కలలుకంటున్నారని విమర్శించారు. ఇవాళ(ఆదివారం) గాంధీభవన్‌లో అద్దంకి దయాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్‌కు అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అన్ని వ్యవస్థలను విధ్వంసం చెసిన తర్వాత బయటకు వచ్చి తానే తెలంగాణను నిర్మించినట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మీరు చేసిన అవినీతి క్షేత్రాలను కూల్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభత్వం పని చేస్తుందని ఉద్ఘాటించారు. బురదలో, మట్టిలో, ప్రాజెక్టుల్లో కేసీఆర్ అవినీతి చేసినట్లుగా.. తమ కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు. ఇంకా కేసీఆర్‌ను బరించే ఓపిక తెలంగాణ సమాజానికి ఉందనుకోవడం భ్రమనే అని ఎద్దేవా చేశారు.
కూల్చడానికి కాదు నిర్మించడానికి అని కేసీఆర్ అంటుంటే విడ్దూరంగా ఉందన్నారు. కేసీఆర్ కూల్చిన వ్యవస్థలకు పునర్జీవం పోయడమే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్ ను పునర్నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తేల్చిచెప్పారు.మూసీని ప్రక్షాళన చేయడం కోసం అక్కడ ఉన్న ప్రజలకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుందని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
కేసీఆర్ ఏమన్నారంటే...
‘రౌడీ పంచాయితీలు చేయడం మాకూవచ్చు. తిట్టడం కూడా వచ్చు. ఈరోజు తిట్టడం మొదలు పెడితే.. రేపటి వరకు తిడతా నేను’’ అని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలకు సేవ చేసే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని అన్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజలను కాపాడాలే తప్ప.. భయపెడతారా అని కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 11 నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు అధికారమిచ్చింది కూల్చడానికి కాదని, నిర్మించడానికని అన్నారు. ప్రభుత్వం అంటే.. అందరినీ కాపాడుకోవాలని, పిచ్చిపిచ్చిగా మాట్లాడటం కాదన్నారు. సమాజాన్ని నిలబెట్టి, నిర్మించాలని కేసీఆర్ హితవుపలికారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వందశాతం మనమే అధికారంలోకి రాబోతున్నామని అన్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. మనమంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. అధికారంలోకి రాగానే వాడిని లోపలేయాలి.. వీడిని లోపలేయాలని చూడబోమని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Census: సమగ్ర ఇంటింటి సర్వే షురూ
Kishan Reddy: రైతులపై రేవంత్ చిన్నచూపు
Mahbubnagar: ఎలివేటెడ్ ఘాట్ రోడ్డు నిర్మాణానికి సీఎం భూమి పూజ.
Read Latest Telangana News and Telugu News