Share News

Anjan Kumar Yadav: ‘‘సదర్’’ను రాష్ట్ర పండుగగా జరపాలి

ABN , Publish Date - Oct 22 , 2024 | 07:35 PM

యాదవులే కాకుండా అన్ని మతాల వారు సదర్ పండుగలో పాల్గొంటారని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన చేయడం హర్షనీయమని అన్నారు.. అప్పట్లో తమ పశువులు మూసీ నదిలో నీళ్లు తాగేవని చెప్పారు. మూసీ నదితో తమకు సత్సంబంధాలు ఉండేవని అన్నారు.. మూసీ కబ్జాల వల్ల తమ పశువులకు మేత లేక దూరప్రాంతాల నుంచి మేత తెస్తున్నారని అన్నారు.

Anjan Kumar Yadav: ‘‘సదర్’’ను రాష్ట్ర పండుగగా జరపాలి

హైదరాబాద్: సదర్ పండుగను ఈనెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు జరుపుతున్నామని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 27వ తేదీన జరిగే సదర్ పండుగ పోస్టర్‌ను ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.... అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.... కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా సదర్ పండుగ జరగనుందని తెలిపారు. రేపు(బుధవారం) వివిధ రాష్టాల నుంచి వస్తున్న దున్నపోతుల రిహర్సల్స్ ఉంటాయని అంజన్ కుమార్ యాదవ్ వివరించారు.


యాదవులే కాకుండా అన్ని మతాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన చేయడం హర్షనీయమని అన్నారు.. అప్పట్లో తమ పశువులు మూసీ నదిలో నీళ్లు తాగేవని చెప్పారు. మూసీ నదితో తమకు సత్సంబంధాలు ఉండేవని అన్నారు. మూసీ కబ్జాల వల్ల తమ పశువులకు మేత లేక దూరప్రాంతాల నుంచి మేత తెస్తున్నామని అంజన్ కుమార్ యాదవ్ వెల్లడించారు.


ఇంకా నగరంలో గేదెల సంఖ్య కూడా చాలా తగ్గిపోయిందని తెలిపారు. 27వ తేదీన జరిగే సదర్ పండుగలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ బృందం పాల్గొంటారని అన్నారు. ఇతర రాష్ట్రాల యాదవ పెద్దలు కూడా పాల్గొంటున్నారని చెప్పారు. వేలాది మంది సమక్షంలో సదర్ పండుగ జరుగుతుందని తెలిపారు. సదర్ పండుగను రాష్ట్ర పండుగగా జరపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Minister Komati Reddy: బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదు.. కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ధ్వజం

Jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు

ABN Effect: గాంధీలో నీటి కటకటకు తెర

Sanjay: జీవన్ రెడ్డి అనుచురుడి హత్యపై ఎమ్మెల్యే సంజయ్ ఆరా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 22 , 2024 | 07:42 PM