Share News

TG News: గణేష్ నిమజ్జనానికి భారీ భద్రత.. రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Sep 09 , 2024 | 02:48 PM

నగరంలో జరిగే గణేష్ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ సిటీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నిమజ్జనం ఏర్పాట్లను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఈరోజు(సోమవారం) పరిశీలించారు.

TG News: గణేష్ నిమజ్జనానికి భారీ భద్రత..  రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక ఆదేశాలు

హైదరాబాద్: నగరంలో జరిగే గణేష్ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ సిటీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నిమజ్జనం ఏర్పాట్లను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఈరోజు(సోమవారం) పరిశీలించారు. అనంతరం మీడియాతో సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ... రాచకొండ పరిధిలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి పదివేల మందితో భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్ కట్టపై 70 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


ALSO READ: TG News: 4కోట్ల మోసాలకు పాల్పడిన రాజస్థాన్ ముఠా అరెస్ట్

విగ్రహాలు తరలి వెళ్లే మార్గంలో 200కు పైగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ప్రస్తుతం మూడు క్రేన్‌లతో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తామని తెలిపారు. మహా నిమజ్జనం నాటికి ఎనిమిది క్రేన్‌లను అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు.


ALSO READ: CM Revanth Reddy: ఐఐహెచ్‌టీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు

అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. భక్తుల సౌకర్యం కోసం తాగునీరు, మొబైల్ టాయిలెట్స్, ట్యాంక్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశామని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం సీసీ కెమెరాల నిఘాతో, పోలీసు సిబ్బంది గస్తీ ఉంటుందని రాచకొండ సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

TG News: నిన్న అదృశ్యమైన బాలుడు.. నీటి గుంటలో పడి మృతి

Mahesh kumar: ప్రతీ హామీ అమలు చేసి తీరతాం

Hyderabad: పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు..

Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి కేసులో సీబీఐకి సుప్రీంకోర్ట్ కీలక ఆదేశాలు

Read LatestTelangana News

Updated Date - Sep 09 , 2024 | 02:57 PM