TG News: ప్రొఫెసర్ మాలిక్ రాసిన ‘భారత ఆర్థిక వ్యవస్థ’ పుస్తకంలో లోతైన అవగాహన: కోదండరాం
ABN , Publish Date - Jun 28 , 2024 | 09:28 PM
అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఏ మాలిక్ రచించిన 'భారత ఆర్థిక వ్యవస్థ' పుస్తకం ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. హైదరాబాద్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగిన ఈ కార్యక్రమంలో కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రితో పాటు పలువురు పాల్గొన్నారు.
హైదరాబాద్: అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఏ మాలిక్ రచించిన 'భారత ఆర్థిక వ్యవస్థ' పుస్తకం ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. హైదరాబాద్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగిన ఈ కార్యక్రమంలో కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మాలిక్ రాసిన పుస్తకంలో సీనియారిటీతో పాటు లోతైన అవగాహన ఉందని అభినందించారు. ఉపయోగకరమైన పుస్తకాలు వీలైనన్ని ఆయన అభిలాషించారు. టీచర్ అంటే చెప్పడమే కాదని, రాయడం కూడా రావాలని వ్యాఖ్యానించారు. మాలిక్ గతంలో అనేక మంచి పుస్తకాలు ఇచ్చారని, ఇప్పుడు కూడా ఇచ్చారని, మున్ముందు కూడా ఇస్తారని కోదండరాం ఆశాభావం వ్యక్తం చేశారు.
మాలిక్ మంచి ఉపాధ్యాయుడు: ప్రొ. లింబాద్రి
తనకు తెలిసిన సమాచారాన్ని సులభమైన భాషలో ప్రజలకు అందించాలనే తపన ఉన్న రచయిత మాలిక్ అని ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి ప్రశంసించారు. నిరంతరం చదవడం, రాయడం, అధ్యయనం చేయడం ఉపాధ్యాయుడి లక్షణమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. మాలిక్ మంచి ఉపాధ్యాయుడని, సమాజంపై ప్రేమతో ఆయన రాసే పుస్తకాలు గొప్పగా ఉంటాయని మెచ్చుకున్నారు. మాలిక్ చాలా ప్రేమతో పుస్తకాలు రాశారని పేర్కొన్నారు.
పోటీ పరీక్షలకు ఉపయోగకరం: డాక్టర్ మాలిక్
‘భారత ఆర్థిక వ్యవస్థ’ పుస్తకావిష్కరణ సందర్భంగా డాక్టర్ మాలిక్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పోటీ పరీక్షలకు ఏవిధంగా సన్నద్ధం కావాలో చెప్పానని, గతంలో రాసిన తాను రాసిన 5 పుస్తకాలు పోటీ పరీక్షలు రాసే వారికి చాలా ఉపయోగపడ్డాయని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ పుస్తకం కూడా ఉపయోగప డుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అభ్యర్థులకు మెదడుకు మించిన భారం మోపడం తనకు ఇష్టం ఉండదని, వీలైనంత చిన్న పుస్తకంలో ఎక్కువ సమాచారం, ఉపయోగకపమైన సమాచారం ఇస్తానని మాలిక్ వివరించారు.