Telangana: తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్.. ఇక దబిడి దిబిడేనా..?!
ABN , Publish Date - Mar 08 , 2024 | 07:35 PM
Lok Sabha Elections 2024: ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 370 సీట్లు లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది బీజేపీ(BJP). ఏ ఒక్క రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉంది పార్టీ అధిష్టానం. తాజాగా దక్షిది రాష్ట్రాలకు గేట్‌వేగా భావిస్తున్న తెలంగాణ(Telangana)పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కమలదళం. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరలేపింది.
Lok Sabha Elections 2024: ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 370 సీట్లు లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది బీజేపీ(BJP). ఏ ఒక్క రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉంది పార్టీ అధిష్టానం. తాజాగా దక్షిది రాష్ట్రాలకు గేట్‌వేగా భావిస్తున్న తెలంగాణ(Telangana)పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కమలదళం. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరలేపింది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలు(Lok Sabha Constituencies) ఉండగా.. ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. పెండింగ్ పార్లమెంట్ స్థానాలపై కసరత్తు చేస్తోంది.
అయితే, ప్రకటించిన 9 స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులు ఉండగా.. బలహీనంగా ఉన్న చోట చేరికలను ప్రోత్సహిస్తోంది కమలం పార్టీ. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే.. ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేయాల్సిందిగా బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావుకు బీజేపీ ఆఫర్ ఇచ్చింది. మరో బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సీతారం నాయక్‌ను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలిశారు. ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించారు. మహబూబాబాద్ టికెట్‌ను సీతారాం నాయక్‌కు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది బీజేపీ నాయకత్వం.
ఇక పెద్దపల్లి పార్లమెంట్ సీటును కళాకారుడు మిట్టపల్లి సురేందర్‌కు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన నల్లగొండ, వరంగల్ స్థానాల కోసం బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తోంది బీజేపీ. మహబూబ్‌నగర్ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతకుమార్ మధ్య పోటీ నెలకొనగా.. మెదక్ సీటు కోసం రఘునందనరావు, గోదావరి అంజిరెడ్డి పోటీ పడుతున్నారు. సోయం బాపూరావు, సోలంకి శ్రీనివాస్, అభినవ్ సర్థార్‌లు ఆదిలాబాద్ సీటును ఆశిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..