Share News

BRS: కాంగ్రెస్‌ ఎక్కడుంటే అక్కడ ఆర్థిక సంక్షోభమే: రాకేష్ రెడ్డి

ABN , Publish Date - Oct 07 , 2024 | 04:49 PM

Telangana: ‘‘మొన్న కర్ణాటక, నిన్న హిమాచల్, నేడు తెలంగాణ.. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా ఆర్థిక సంక్షోభం వస్తుంది’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పీకి పందిరి వేసిందని మండిపడ్డారు.

BRS: కాంగ్రెస్‌ ఎక్కడుంటే అక్కడ ఆర్థిక సంక్షోభమే: రాకేష్ రెడ్డి
BRS Leader Rakesh Reddy

హైదరాబాద్, అక్టోబర్ 7: కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Govt) బీఆర్‌ఎస్ నేత రాకేష్ రెడ్డి (BRS Leader Rakesh Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే క్రైసిస్ అని.. ‘‘మొన్న కర్ణాటక, నిన్న హిమాచల్, నేడు తెలంగాణ.. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా ఆర్థిక సంక్షోభం వస్తుంది’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పీకి పందిరి వేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిందన్నారు.

AP Police: దుర్గమ్మ చెంత విధులకు వచ్చిన పోలీసులు.. ఎంతటి ఘనకార్యం చేశారంటే


హైదరాబాద్ నగరంలో టూ లెట్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయన్నారు. రాష్ట్రంలో టెక్స్‌టైల్ ఇండస్ట్రీ, టూరిజం కుదేలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు తొమ్మిది నెలలుగా జీతాలు లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి (PM Narendra Modi) రాసిన లేఖతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బండారం బయటపడిందన్నారు. 18 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశామని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారన్నారు. అభివృద్ధి నిధులను కేవలం ప్రభుత్వం రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. కాంగ్రెస్ రైతు భరోసాతో రైతులకు భరోసా లేకుండా పోయిందని విమర్శించారు.

Optical Illusion: ఈ గుహలో ఓ కుక్క దాక్కుంది.. 5 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లు చాలా పవర్‌ఫుల్..


ఆర్థిక ఎమెర్జెన్సీ ఖాయం...

రాష్ట్రంలో ఆర్థిక ఎమెర్జెన్సీ వచ్చే పరిస్థితి ఏర్పడిందని.. రేవంత్ రెడ్డి విధ్వంసం వైపు అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఎజెండా ఏంటి అని ప్రశ్నించారు. గత సంవత్సరం 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని.. ఈ ఏడాది 9 లక్షల రిజిస్ట్రేషన్లు కూడా జరగలేదని చెప్పుకొచ్చారు. మూసీ ప్రక్షాళన కాదు రేవంత్ రెడ్డి మైండ్ ప్రక్షాళన చేయాలంటూ ఫైర్ అయ్యారు. మూసీ సుందరీకరణ తెలంగాణ ప్రజలకు సున్నం పెడుతోందన్నారు. మూసీ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌తో రేవంత్ రెడ్డి ముందే కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మూసీపై అఖిలపక్షాన్ని రేవంత్ రెడ్డి పిలవాలని డిమాండ్ చేశారు. కేన్స్ సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్‌కు తరలివెళ్లిపోయిందంటూ బీఆర్‌ఎస్ నేత రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

Jani Master: రెగ్యులర్ బెయిల్‌ కోసం జానీమాస్టర్ పిటిషన్

Thummala: గాంధీభవన్‌లో ముఖాముఖి.. పాల్గొన్న మంత్రి తుమ్మల

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2024 | 04:53 PM