MLA Maganti: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు చేదు అనుభవం
ABN , Publish Date - Jun 29 , 2024 | 07:20 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు (MLA Maganti Gopinath) చేదు అనుభవం ఎదురైంది. ఖైరతాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. మాగంటి గోపీనాథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు (MLA Maganti Gopinath) చేదు అనుభవం ఎదురైంది. ఖైరతాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీని ఈరోజు(శనివారం) చేయాలని ఎమ్మెల్యేలు భావించారు. కానీ కాంగ్రెస్ కార్పొరేటర్లు మాగంటిని అడ్డుకోవడంతో ఫించన్లు పంపిణీ చేయలేదు. మాగంటి గోపీనాథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్పొరేటర్లు బాబా ఫసియుద్ధీన్, సీఎన్ రెడ్డి వర్గీయుల ఆందోళన చేపట్టారు.
గత ప్రభుత్వం హయాంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే గోపీనాథ్‌కు కార్పొరేటర్ సీఎన్.రెడ్డికు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కాంగ్రెస్ నేతల ఆందోళనలతో చెక్కులు పంపిణీ చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపీనాథ్ వెనుదిరిగారు.