Share News

Kavitha Arrest: అరెస్ట్ తర్వాత కవిత ఫస్ట్ రియాక్షన్

ABN , Publish Date - Mar 15 , 2024 | 07:35 PM

MLC Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. ఢిల్లీకి తరలిస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కవిత ఇంట్లో ఎంత సీన్ జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈడీ అనుమతితో కవిత ఇంట్లోకి వెళ్లిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రచ్చ రచ్చ చేశారు.

Kavitha Arrest: అరెస్ట్ తర్వాత కవిత ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) అరెస్ట్ చేసిన ఈడీ.. ఢిల్లీకి తరలిస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కవిత ఇంట్లో ఎంత సీన్ జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈడీ అనుమతితో కవిత ఇంట్లోకి వెళ్లిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రచ్చ రచ్చ చేశారు. ఇదిగో అరెస్ట్ వారంట్ అంటూ నోటీసులు చూపించడం.. యాక్ట్‌కు సంబంధించిన వివరాలన్నీ చెప్పిన తర్వాత పరిస్థితి కాసింత అదుపులోనికి వచ్చింది. దీంతో ఢిల్లీకి కవితను ఈడీ బృందం తరలిస్తోంది. కవిత.. ఇంట్లోనుంచి బయటికి వస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు, అభిమానులు నినాదాలు, ఈలలు, కేకలతో హోరెత్తించారు. దీంతో ఈ అరెస్ట్ వ్యవహారంపై కవిత మొదటిసారిగా.. రెండే రెండు మాటల్లో స్పందించారు.


ఫస్ట్ రియాక్షన్

  • ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగిన ఎదుర్కొంటాం

  • బీఆర్ఎస్ శ్రేణులు బలంగా మనోదైర్యంతో ఉండాలని విజ్ఞప్తి

  • అరెస్ట్ తర్వాత కారులో వెళ్తూ పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన కవిత

  • ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా పార్టీ శ్రేణులను సముదాయించిన సీనియర్ నాయకులు

  • ఇలాంటి అనిచివేతను, దొంగ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలను..

  • చట్టం పైన నమ్మకం ఉంచి ఎదుర్కొంటామని పార్టీ శ్రేణులకు తెలిపిన కవిత, బీఆర్ఎస్ నాయకత్వం

Updated Date - Mar 15 , 2024 | 07:44 PM