Share News

KTR: రుణమాఫీపై ముఖ్యమంత్రివన్నీ డొల్ల మాటలే..

ABN , Publish Date - Oct 04 , 2024 | 12:28 PM

Telangana: రుణమాఫీపై వ్యవసాయ మంత్రి ప్రకటనతో బండారం బయటపడిందంటూ విరుచుకుపడ్డారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలన్నీ డొల్లమాటలే అని అన్నారు. అధికారికంగా 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగితే అనధికారికంగా ఇంకెంతమంది రైతులు ఉన్నారో అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

KTR: రుణమాఫీపై ముఖ్యమంత్రివన్నీ డొల్ల మాటలే..
BRS working President KTR

హైదరాబాద్, అక్టోబర్ 4: రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. వందశాతం పూర్తి చేస్తామని చెప్పిన మాటలన్నీ అబద్దాలే అంటూ వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీపై మరోసారి ఎక్స్‌ వేదికగా కేటీఆర్ విరుచుకుపడ్డారు. రుణమాఫీపై వ్యవసాయ మంత్రి ప్రకటనతో బండారం బయటపడిందంటూ విరుచుకుపడ్డారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Rrevanth Reddy) మాటలన్నీ డొల్లమాటలే అని అన్నారు. అధికారికంగా 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగితే అనధికారికంగా ఇంకెంతమంది రైతులు ఉన్నారో అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

Chennai: వామ్మో.. పెద్దప్రమాదమే తప్పిందిగా.. రైలు పట్టాలో పగుళ్లు


కేటీఆర్ ట్వీట్...

20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందన్నారు. వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయిందని విమర్శించారు. ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా చేసి.. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం చేశారన్నారు.

Viral: మీ తెలివికో పరీక్ష! ఈ 2 బొమ్మల్లో 3 తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టగలరా?


2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక లెక్కల ప్రకారమే 20 లక్షల అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరో అని అన్నారు. చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదని.. ఇవ్వాల్సిన రైతుబంధు సీజన్ ముగిసినా ఇయ్యలేదన్నారు. రాబంధుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభం రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోలేని శాపం అంటూ కేటీఆర్ పోస్టు చేశారు.


మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌పై కేటీఆర్‌ ట్వీట్...

మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పేదల పొట్ట కొడుతోందని కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆంధ్రజ్యోతి కథనాలను ఎక్స్‌లో షేర్ చేశారు. పేదల గుండెలు ఆగుతున్నా.. కాంగ్రెస్ ధనదాహం తీరట్లేదని అన్నారు. "ఆగుతున్న గుండెలు - విడిపోతున్న కుటుంబాలు, అయినా తగ్గని సర్కార్ దాహం. కలల సౌధం ఖరీదు అక్షరాల 25 వేలు. కష్టపడి పస్తులుండి పైసా పైసా కూడేసి, బ్యాంకు నుండి అప్పు తెచ్చి కట్టిన గుడును కూల్చుతారని భయంతో పోతున్న ప్రాణాలు.16 కాదు 18 మంది అయినా సరే ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉన్న కుటుంబాలను రోడ్డుకు ఈడ్చి కుటుంబాల్లో చిచ్చులు పెట్టిన మూర్కుడు రేవంత్ రెడ్డి. ఇండ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్ రూమ్‌తో పాటు రూ.25 వేల పారితోషకం అంటూ అధికారుల వెకిలి ఆఫర్లు. కోటి ఆశలతో లక్షలు, కోట్లు వెచ్చించి కట్టుకున్న ఇండ్లకు రూ.25 వేలా. రేవంత్ తన అన్న ఇంటికి, తన మంత్రుల ఇంటికి రూ.25 వేలు కాదు రూ.50 వేలు ఇచ్చి కూల్చమంటారా ఒకసారి అడుగు. ఇళ్లు పోతున్నాయి అనే భయంతో బుచ్చమ్మ, కుమారన్న ప్రాణాలు పోయాయి. నీ ధన దాహానికి, నీ స్కాములకు ఇంకా ఎన్ని ప్రాణాలు బలితీసుకుంటావో చెప్పు"అని కేటీఆర్ రేవంత్‌ను ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి..

NIA: బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి

Bathukamma: ముచ్చటగా మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 04 , 2024 | 12:35 PM