Share News

KTR: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ ఏమన్నారంటే

ABN , Publish Date - Oct 02 , 2024 | 02:33 PM

Telangana: ‘‘మాకు సంబంధం లేని వ్యవహారంలో కొండా సురేఖ మాపై ఏడుస్తున్నారు. నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నానని కొండా సురేఖ అనలేదా? నాకు కుటుంబం.. భార్య.. పిల్లలు లేరా?’’

KTR: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ ఏమన్నారంటే
BRS working President KTR

హైదరాబాద్, అక్టోబర్ 2: హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్‌కు అలవాటని, అక్కినేని నాగచైతన్య - సమంత విడిపోడానికి కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ (Minister konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్‌ (BRS Working President KTR) స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మాకు సంబంధం లేని వ్యవహారంలో కొండా సురేఖ మాపై ఏడుస్తున్నారు. నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నానని కొండా సురేఖ అనలేదా? నాకు కుటుంబం.. భార్య.. పిల్లలు లేరా? మొదట.. కొండా సురేఖ, సీతక్కలు సీఎం రేవంత్ నోరును ఫినాయిల్‌తో కడగాలి. కొండా సురేఖపై సోషల్ మీడియా పోస్టింగ్‌లతో మాకు సంబంధం లేదు. కొండా సురేఖ ఏడిస్తే మాకేమి సంబంధం’’ అని ప్రశ్నించారు.

Viral Video: ఇది కదా బతుకమ్మ సంబరాల ఆనందం అంటే..


సోషల్ మీడియాలో కేసీఆర్‌ను తిట్టిపోయలేదా అని అన్నారు. చేతకాకనే కాంగ్రెస్ తమపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేకనే దాడులు చేయిస్తోందన్నారు. సెక్యూరిటీ లేకుండా మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబులు మూసీ ప్రాంతంలో తిరగాలన్నారు. జగ్గారెడ్డి, మధు యాష్కీలు హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య అండర్ స్టాండింగ్ ఉందని.. అందుకే పొంగులేటి ఇంటిపై ఐటీ దాడుల గురించి బీజేపీ మాట్లాడటం లేదన్నారు. మూసీ బాధితుల కోసం రేపు (గురువారం) ఎల్బీనగర్‌కు వెళుతున్నామని.. కాంగ్రెస్ వాళ్ళుఅడ్డొస్తే ఏం చేయాలో అది చేస్తామన్నారు. ‘‘మా ఆత్మరక్షణ కూడా మేము చూసుకోవాలి కదా’’ అని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

CM Chandrababu: చెత్త పన్నుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..


మంత్రి కొండా సురేఖ కామెంట్స్ ఇవే..

అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కేటీఆర్‌కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయనేనన్నారు. బాపూఘాట్ లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "కేటీఆర్‌కు తల్లి, అక్క, చెల్లి లేరా. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు. మత్తుపదార్థాలు అలవాటు చేశారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారు. చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి ఆయనే కారణం. ఆయన డ్రగ్స్‌కు అలవాటుపడి వాళ్లకూ అలవాటు చేశారు. రేవ్ పార్టీలు చేసుకుని వాళ్లని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. బీఆర్ఎస్ దొంగ ఏడుపులు మాకవసరం లేదు. హరీశ్ రావు మనస్సున మనిషిగా స్పందించారు. నాపై ట్రోలింగ్ జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు. మంత్రి సీతక్క, మేయర్‌ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ఐదేళ్లు బీఆర్ఎస్‌లో పనిచేశా.. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశాం. రాజకీయ విలువలు దిగజారిపోయాయి. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తిచూపాలి. వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించవద్దు. దుబాయి నుంచి నాలుగు సోషల్ మీడియా అకౌంట్లతో నాపై ఫేక్ పోస్టులు పెడుతున్నారు"అని సురేఖ అన్నారు.


ఇవి కూడా చదవండి...

KTR: ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు.. కేటీఆర్ ట్వీట్

Pawan Kalyan: శ్రీవారి పాదాల చెంత వారాహి డిక్లరేషన్ బుక్.. మీడియాకు ప్రత్యేకంగా చూపించిన పవన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2024 | 06:32 PM