Middle East situation: న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద బలగాలు మోహరింపు
ABN , Publish Date - Oct 02 , 2024 | 02:00 PM
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతుంది. మంగళవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా క్షిపణి దాడులకు దిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు బుధవారం కీలక సూచన చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.
టెహ్రాన్, అక్టోబర్ 02: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతుంది. మంగళవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా క్షిపణి దాడులకు దిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు బుధవారం కీలక సూచన చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.
స్థానిక అధికారులు సూచించిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఇరాన్‌లోని భారతీయులకు విజ్జప్తి చేసింది. అలాగే ఏదైన అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు రాయబార కార్యాలయంలోని అధికారులతో సంప్రదించాలని స్పష్టం చేసింది. దేశంలోని తాజా పరిస్థితులను తమ కార్యాలయం ఎప్పటికప్పుడు గమనిస్తుందని టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది.
ఇక ఇజ్రాయెల్ రాజధాని టెలి అవివ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం మంగళవారం ఇదే తరహా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్ల వద్దని పేర్కొంది.
స్థానిక అధికారులు సూచించిన ఆదేశాలకు తూచా తప్పకుండా పాటించాలని దేశ వాసులకు ఇజ్రాయెల్‌లోని భారతీయ రాయబార కార్యాలయం సూచించింది. అత్యవసర సమయాల్లో అవసరమైతే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలంటూ 972-547520711, +972-543278392 ఫోన్ నెంబర్లను సైతం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇక దేశంలోని పరిస్థితులను తమ కార్యాలయం ఎప్పటికప్పుడు గమనిస్తుందని స్పష్టం చేసింది.
మరోవైపు ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరాన్ దాదాపు 180 మిసైళ్లతో దాడి చేసింది. వాటిలో చాలా భాగం మిసైళ్లను ఇజ్రాయెల్ నాశనం చేసిన విషయం విధితమే. ఇక ఇరాన్, ఇజ్రాయెల్‌లోని ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ రెండు దేశాల యా దేశాలకు వెళ్లే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని భారతీయులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.
ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో 18 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇక ఇరాన్‌లో 5 నుంచి 10 వేల మంది భారతీయులు ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలను వెల్లడించింది.
ఇంకోవైపు దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. గతంలో అంటే.. 2021, 2023లో బాంబు పేలుళ్లు సంభవించాయి. అదికాక.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైళ్ల దాడికి నిన్న తెగబడింది. దీంతో భారత ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా అప్రమత్తమైంది. ఆ క్రమంలో మన దేశంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద భారీగా బలగాలను మోహరించారు.
For National News And Telugu News..