Share News

KTR: కోల్‌కత్తాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై కేటీఆర్ ట్వీట్!

ABN , Publish Date - Aug 12 , 2024 | 02:58 PM

Telangana: కోల్‌కత్తాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ను రేప్ చేసి మర్డర్ చేసిన వారిని వదలొద్దు అంటూ బెంగాల్ ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కోల్‌కతాలోని ఆర్జీకర్‌ మెడికల్‌ కాలేజీలో 31 ఏండ్ల ట్రైనీ డాక్టర్‌‌ను రేప్ చేసి హత్య చేసిన సంఘటన తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు.

KTR: కోల్‌కత్తాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై కేటీఆర్ ట్వీట్!
BRS Working President KTR

హైదరాబాద్, ఆగస్టు 12: కోల్‌కత్తాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ట్విట్టర్ వేదికగా స్పందించారు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ను రేప్ చేసి మర్డర్ చేసిన వారిని వదలొద్దు అంటూ బెంగాల్ ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కోల్‌కతాలోని ఆర్జీకర్‌ మెడికల్‌ కాలేజీలో 31 ఏండ్ల ట్రైనీ డాక్టర్‌‌ను రేప్ చేసి హత్య చేసిన సంఘటన తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు.

YSRCP : టీడీపీ హయాంలోనూ వైసీపీ కాంట్రాక్టర్ దబాయింపులు.. ఎక్కడంటే?


హాస్పిటల్‌లో కూడా డాక్టర్లు సురక్షితంగా ఉండకపోతే మన ఆడపిల్లలు ఇంకెక్కడ క్షేమంగా ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంత క్రూరమైన ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టకూడదని అన్నారు. బెంగాల్‌లోని మమతా సర్కార్ నేరస్తున్ని పట్టుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. నిరసన తెలుపుతున్న డాక్టర్లకు కేటీఆర్ సంఘీభావం తెలిపారు.

MLC Kavitha: సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై బిగ్ ట్విస్ట్..


కాగా... కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాలలో పనిచేసే ఓ పీజీటీ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ) వైద్యురాలిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు. పీజీ సెకండియర్‌ చదువుతున్న ఆమె.. ఈనెల 8న రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం (ఆగస్టు 9) ఉదయం ఆస్పత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్‌ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు ప్రాథమిక శవపరీక్షలో నిర్ధారణ అయింది. మర్మాంగాలు, నోరు, కళ్ల నుంచి రక్తస్రావం జరిగినట్లు తేలింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఆమె హత్యకు గురై ఉండొచ్చని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసుకు సంబంధం ఉందన్న అనుమానంతో ఇప్పటికే ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా... . జడ్జి 14 రోజుల పోలీస్‌ రిమాండ్‌కు అనుమతి ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

TG News: హైదరాబాద్‌లో భారీగా హషిష్ ఆయిల్ డ్రగ్స్ పట్టివేత

TG Minister: ఖమ్మంలో కొనసాగుతున్న తెలంగాణ మంత్రుల పర్యటన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 12 , 2024 | 03:08 PM