Share News

Viral Video: పాము, మూడు ముంగిసల మధ్య భీకర ఫైట్.. రన్ వేపై పోరాడుకున్న బద్ధ శత్రువులు..!

ABN , Publish Date - Aug 12 , 2024 | 02:21 PM

పాము, ముంగిసల వైరం గురించి తెలిసిందే. పుట్టుకతోనే అవి ఒకదానికొకటి బద్ధ శత్రువులు. అవి ఎదురుపడితే అక్కడ భీకర యుద్ధం జరగాల్సిందే. ఏదో ఒకటి ఒటమి చెంది పలాయన చిత్తగించాల్సిందే. తాజాగా పాట్నా విమానాశ్రయంలో కూడా పాము, ముంగిసల మధ్య ఫైటింగ్ జరిగింది.

Viral Video: పాము, మూడు ముంగిసల మధ్య భీకర ఫైట్.. రన్ వేపై పోరాడుకున్న బద్ధ శత్రువులు..!
fight between a cobra and mongooses

పాము (Snake), ముంగిసల (Mongooses) వైరం గురించి తెలిసిందే. పుట్టుకతోనే అవి ఒకదానికొకటి బద్ధ శత్రువులు. అవి ఎదురుపడితే అక్కడ భీకర యుద్ధం జరగాల్సిందే. ఏదో ఒకటి ఒటమి చెంది పలాయన చిత్తగించాల్సిందే. తాజాగా పాట్నా విమానాశ్రయంలో కూడా పాము, ముంగిసల మధ్య ఫైటింగ్ జరిగింది. మూడు ముంగిసలతో ఒక పాము భీకరంగా పోరాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (fight between a cobra and mongooses). @UmeshStudy అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


పాట్నా విమానాశ్రయం (Patna Airport) లోని రన్ వేపై మూడు ముంగిసలు ఓ పాముపై దాడికి దిగాయి. మొదట పాముపై ఒక ముంగిస దాడికి దిగింది. ఆ తర్వాత అక్కడకు మరో రెండు ముంగిసలు వచ్చాయి. ఆ మూడు కలిసి పాముపై దండెత్తాయి. వాటి దాడి నుంచి తప్పించుకునేందుకు పాము తీవ్రంగా ప్రయత్నించింది. అయినా అవి వదల్లేదు. అయితే చివరకు ఆ ఫైటింగ్‌లో గెలిచింది ఎవరనే విషయం తేలకముందే వీడియో పూర్తయిపోయింది. ఆ ఫైటింగ్‌ను విమానాశ్రయంలోని ప్రేక్షకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.


ఆ వీడియోకు వేల కొద్దీ వ్యూస్, లైక్స్ వచ్చాయి. ఆ భీకర ఫైటింగ్‌పై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నిజమైన ఫైటింగ్ ఇది``, ``పాము గెలిచే ఛాన్స్ లేదు``, ``ముంగిసలు వదిలేలా లేవు``, ``పాముకు పారిపోయే అవకాశం లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: మీ కళ్లకు పరీక్ష.. ఈ రెండు ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టండి!


Viral Video: వెనక్కి వెళ్తున్న లారీ.. బ్రేకులు ఫెయిల్ కాదు.. వీడియో చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే..!


Viral Video: తెల్ల పులి ముందు కుప్పకూలిన బాలుడు.. ఆ తర్వాతేం జరిగిందో చూస్తే కళ్లు తేలేయడం ఖాయం!


Viral News: ట్యాలెంట్ కాదు.. జాతకమే ముఖ్యం.. ఆ రాశిలో పుట్టిన వారు అప్లై చేయొద్దంటూ చైనా కంపెనీ వినూత్న ప్రకటన!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 12 , 2024 | 02:21 PM