Share News

CM Revanth: ఆ ప్రక్రియను డిసెంబర్ 9లోగా పూర్తి చేస్తాం

ABN , Publish Date - Jul 20 , 2024 | 12:50 PM

Telangana: నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ప్రజా భవన్ లో "రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం" ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

CM Revanth: ఆ ప్రక్రియను డిసెంబర్ 9లోగా పూర్తి చేస్తాం
CM Revanth Reddy

హైదరాబాద్, జూలై 20: నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శనివారం ప్రజా భవన్ లో "రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం" ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు.

ADR: దేశంలో అత్యధిక డబ్బులు ఉన్న పార్టీ ఇదే..!!


గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందన్నారు. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశామని తెలిపారు. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించామన్నారు. డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్-2 పరీక్ష (Group-2 Exam) వాయిదా వేశామని చెప్పారు. ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే అని తెలిపారు. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Delhi Liquor Scam: 10 కిలోల బరువు తగ్గిన కవిత ?.. భర్త అనిల్ కంటతడి!


ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ (Job Calender) ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఇక నుంచి ప్రతీ ఏటా మార్చ్‌లోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటామన్నారు. జూన్‌ 2 లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

Andhra Pradesh: ఏజెంట్ చేతిలో మోసపోయిన ఏపీ వాసి.. స్వదేశానికి తీసుకొస్తానంటూ హామీ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 20 , 2024 | 12:53 PM