Share News

IAS: నో డౌట్.. నేను పని చేస్తా.. చేయిస్తా..!

ABN , Publish Date - Jul 20 , 2024 | 12:31 PM

‘నేను పని చేస్తేనే.. నా పరిధిలో ఉన్న అధికార యంత్రాంగం అంతా పని చేస్తుంది అని నమ్ముతా. నేను క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటేనే వాటి పరిష్కారానికి ఏం చేయాలో తెలుస్తుంది.

IAS: నో డౌట్.. నేను పని చేస్తా.. చేయిస్తా..!

- సమస్యలు తెలుసుకునేందుకే ఆకస్మిక తనిఖీలు

- ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ అపూర్వ్‌ చౌహన్‌

హైదరాబాద్: ‘నేను పని చేస్తేనే.. నా పరిధిలో ఉన్న అధికార యంత్రాంగం అంతా పని చేస్తుంది అని నమ్ముతా. నేను క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటేనే వాటి పరిష్కారానికి ఏం చేయాలో తెలుస్తుంది. అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించే ముందు ఆయా ప్రాంతాల్లో సమస్యలు, పరిష్కారం ఎప్పటిలోగా చూపగలం, అధికారుల నిర్లక్ష్యమా లేక నిధుల కొరతనా అనే విషయాలు తెలుసుకునేందుకే నేను జోన్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నా’ అని కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్‌ అధికారి అపూర్వ్‌ చౌహన్‌(IAS officer Apoorv Chauhan) తెలిపారు సమస్యల పరిష్కారానికి ఏం చేయాలో తెలుసుకునే పనిలో నిమగ్నమైనట్లు ఆయన వివరించారు. జడ్సీ ‘ఆంధ్రజ్యోతి’తో పలు విషయాలను పంచుకున్నారు.

ఇదికూడా చదవండి: Secunderabad: 100 సీసీ కెమెరాలతో నిఘా.. బందోబస్తులో 1,500 మంది పోలీసులు


తనిఖీల్లో మీకు ఎదురవుతున్న సమస్యలు ఏమిటి.

నేను కూకట్‌పల్లి జోన్‌కు వచ్చినప్పటి నుంచి రోజుకు ఓ వార్డు చొప్పన ప్రతీరోజు ఉదయం 5.30 గంటలకే ఫీల్డ్‌కు వెళ్తున్నా. ఇక ఉదయం 7 గంటలకు ఏదో ఒక వార్డులో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకుంటున్నా. నాతో పాటే శానిటరీ, ఇంజనీరింగ్‌, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను నా దృష్టికి తెస్తున్నారు.

దోమల సమస్యలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.

జోన్‌ పరిధిలో 41 చెరులకు గాను 19 చెరువుల్లో గుర్రపుడెక్క తీయాల్సి ఉంది. కొన్నింటిలో పని ప్రారంభించాం. డెంగీ, మలేరియా బారినపడకుండా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాం. పరిసరాల పరిశుభ్రత విషయంలో శానిటేషన్‌ సిబ్బందిని అప్రమత్తం చేశా.


city7.jpg

కాలనీలు, బస్తీల్లో వరద నీరు సాఫీగా వెళ్లేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.

నేను బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మూసాపేట్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, గాజులరామారం, అల్వాల్‌ సర్కిళ్లలో పర్యటించా. వర్షం నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించాం. జోన్‌ పరిధిలో 24 చోట్ల రోజుల తరబడి నీరు నిలబడుతోంది. 19 చోట్ల పరిష్కారం చూపగా మరో అయిదులో రెండు చోట్ల నేను అప్రూవల్‌ ఇచ్చా. మరో మూడింటి పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదించే పనిలో ఉన్నాం.

వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలేమిటి.

దోమల వల్ల డెంగీ వ్యాప్తి చెందుతుందన్న విషయం తెలిసిందే. రోజుకు 100 కుటుంబాల డేటా సేకరించేలా ఇంటింటికీ సర్వే చేయిస్తున్నాం. ఇప్పటికే జోన్‌ పరిధిలో 30 డెంగీ కేసులు నమోదయ్యాయి. మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తూ డెంగీ, చికున్‌గన్యా వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా. బస్తీలు, కాలనీల్లో దోమల వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం.


ఉద్యోగుల నుంచి స్పందన ఎలా ఉంది?

నేను పని చేయాలి.. నాతో పాటు జోన్‌ పరిధిలో ఉన్న అధికారులు, సిబ్బంది చేత పని చేయించుకోవాలి. నేను సమస్యలపై ప్రశ్నించడం కంటే అవి పరిష్కారానికి నోచుకోకుండా ఉండటానికి గల కారణాలు చెప్పమని అడుగుతున్నా. దీంతో ఉద్యోగులు స్వేచ్ఛగా వారికి ఉన్న ఇబ్బందులను నాతో పంచుకుంటున్నారు. దీంతో ఉద్యోగుల కొరత అనేది నేను తీర్చేది కాదు.. నా దగ్గర ఉన్న సిబ్బందితో ఎలా పనిచేయించుకోవాలన్న దానిపైనే నేను ఫోకస్‌ పెట్టా.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 20 , 2024 | 01:01 PM