Share News

Congress VS BRS: రాజీవ్‌గాంధీ విగ్రహం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రభస

ABN , Publish Date - Aug 20 , 2024 | 11:05 AM

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. ఈరోజు(మంగళవారం) రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ సచివాలయం ముందు ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది.

Congress VS BRS: రాజీవ్‌గాంధీ విగ్రహం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రభస

హైదరాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. ఈరోజు(మంగళవారం) రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ సచివాలయం ముందు ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇప్పుడు రెండు పార్టీల్లోని నేతల మధ్య రభస మొదలైంది.


నేడు రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని కాంగ్రెస్ భావించింది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిలవాలని నిర్ణయించింది. తేదీలు కుదరకపోవడంతో అగ్రనేతలు విగ్రహ ఆవిష్కరణకు రాలేదు. దీంతో రాజీవ్ విగ్రహా ఆవిష్కరణ వాయిదా పడింది. సెక్రటేరియట్ ముందు ఆయన విగ్రహంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సెక్రటేరియట్ ముందు రాజీవ్ విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీకి పలువురు కవులు, కళాకారులు లేఖ రాశారు.


తమ ప్రభుత్వం వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని తీసేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. రాజీవ్ విగ్రహం జోలికి వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు తాటతీస్తారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ గురించి మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు వైరల్ చేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్‌పై కేటీఆర్ అభ్యతరం వ్యక్తం చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

Updated Date - Aug 20 , 2024 | 11:12 AM