CM Revanth: సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ పెట్టిన కండిషన్స్ ఇవే...
ABN , Publish Date - Jul 02 , 2024 | 03:06 PM
Telangana: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రీ షరతులు విధించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటి బ్యూరో డిపార్ట్మెంట్స్‌కు కేటాయించిన నూతన వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... సినీ పరిశ్రమలకు పలు కండిషన్లు పెట్టారు.
హైదరాబాద్, జూలై 2: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు (Telugu film industry) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫ్రీ షరతులు విధించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటి బ్యూరో డిపార్ట్మెంట్స్‌కు కేటాయించిన నూతన వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... సినీ పరిశ్రమలకు పలు కండిషన్లు పెట్టారు. సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమాల్లో అవగాహన కల్పించాలన్నారు. వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై సినిమాకు ముందు ప్రదర్శించాలన్నారు. సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారని.. కానీ వీటిపై అవగాహన కల్పించడం లేదని ముఖ్యమంత్రి తెలిపారు.
TS News: టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి ఏబీవీపీ యత్నం.. ఉద్రిక్తం
డ్రగ్స్, సైబర్ నేరాలపై సినిమాకు ముందు కానీ సినిమా తరువాత అయిన 3 నిమిషాలు వీడియోతో అవగానే కల్పించాలని... అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అలాంటి నిర్మాతలకు, డైరెక్టర్‌లకు, తారాగణంకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవని తేల్చిచెప్పేశారు. సినిమా థియేటర్లు యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై థియేటర్లలో ప్రసారం చేయకపోతే అలాంటి థియేటర్లకు అనుమతి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి....
Surya Catch Row: క్యాచ్ వివాదం.. బౌండరీ లైన్‌ని వెనక్కు నెట్టారా.. అసలు నిజం ఇది!
TS News: ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే మహిపాల్
Read Latest Telangana News AND Telugu News